Truecaller announces ‘Family Plan’: ‘ట్రూ కాలర్’ నుంచి ఫ్యామిలీ ప్లాన్-truecaller announces family plan which helps upto 5 members to get its services ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Truecaller Announces ‘Family Plan’: ‘ట్రూ కాలర్’ నుంచి ఫ్యామిలీ ప్లాన్

Truecaller announces ‘Family Plan’: ‘ట్రూ కాలర్’ నుంచి ఫ్యామిలీ ప్లాన్

HT Telugu Desk HT Telugu
Dec 15, 2022 04:43 PM IST

Truecaller app: ఈ రోజుల్లో దాదాపు ప్రతీ స్మార్ట్ ఫోన్ లో ఉండే యాప్ ‘ట్రూ కాలర్’. మన కాంటాక్ట్ లిస్ట్ లో లేని వారి నుంచి వచ్చే కాల్స్ వివరాలను అందించే యాప్ ఇది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ట్రూ కాలర్(Truecaller) అనేది కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్. మీకు వస్తున్న కాల్ ఎవరి నుంచి వస్తోందో ఈ (Truecaller) యాప్ తెలియజేస్తుంది. స్పామ్, అన్ వాంటెడ్ కాల్స్ పై సమాచారమిస్తుంది. ఇప్పుడు దాదాపు ప్రతీ స్మార్ట్ ఫోన్ యూజర్ ఈ యాప్(Truecaller) ను వినియోగిస్తున్నాడు.

Truecaller app: ఉచితంగా కూడా ట్రూ కాలర్ సేవలు

యాడ్స్ తోను, అలాగే లిమిటెడ్ సర్వీసెస్ తోనూ యూజర్ ఈ ట్రూ కాలర్(Truecaller) యాప్ ను ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే, ప్రీమియర్ సేవలు కావాలనుకునే వారు మాత్రం కొంత మొత్తం చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలలు, సంవత్సరం కాల వ్యవధితో సబ్ స్క్రిప్షన్ ప్లాన్లు ఉన్నాయి.

Family Plan: కుటుంబం అందరికీ ఉపయోగపడే ప్లాన్

తాాజాగా, ట్రూకాలర్(Truecaller) కొత్త ప్లాన్ ను తెరపైకి తీసుకువచ్చింది.ఈ ప్లాన్ తో కుటుంబంలోని సభ్యులందరూ ట్రూకాలర్ ప్రీమియర్ సేవలను పొందే అవకాశముంది. ట్రూకాలర్(Truecaller) ప్రీమియం కనెక్ట్ వినియోగదారుల కోసం ఫ్యామిలీ ప్లాన్(Family Plan) పేరుతో ఈ ప్లాన్ ను ప్రారంభించింది. ఇందులో ప్రైమరీ యూజర్ తో పాటు మరో నలుగురు ట్రూకాలర్ ప్రీమియర్ సేవలను పొందవచ్చు. అంటే, ఒకే ప్లాన్(Family Plan) తో ఐదుగురు సభ్యులు ఈ ప్రీమియం కనెక్ట్ సేవలను పొందవచ్చు. ప్రైమరీ యూజర్ తో పాటు ఈ సేవలను పొందేవారు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కావచ్చు. ఇతరులను ఈ ప్లాన్(Family Plan) లో యాడ్ చేయడం వల్ల ఎక్స్ ట్రా చార్జి ఏమీ ఉండదు. అలాగే, ముఖ్యంగా ఈ ప్లాన్ లోని సభ్యులు ఒకరి కాల్స్ ను, మెసేజెస్ ను మరొకరు చూడడానికి కూడా వీలుండదు.

ఈ ఫ్యామిలీ ప్లాన్(Family Plan) అందించే సేవల్లో ముఖ్యమైనవి..

  • అడ్వాన్స్ డ్ స్పామ్ బ్లాకింగ్(Advanced Spam Blocking)
  • మీ ప్రొఫైల్ ను చూసినవారి వివరాలు (Who Viewed My Profile)
  • ఎలాంటి ప్రకటనలు ఉండవు(No Ads)
  • కాల్స్ అనౌన్స్ మెంట్ సదుపాయం(Announce Calls)
  • అన్ లిమిటెడ్ కాంటాక్ట్ రిక్వెస్ట్స్(Unlimited Contact Requests)
  • ఇన్ కాగ్నిటో మోడ్(Incognito Mode)
  • మెసేజింగ్ యాప్స్ కాలర్ ఐడీ(Messaging Apps Caller ID)
  • ఘోస్ట్ కాల్స్(Ghost Call)
  • ప్రీమియం బ్యాడ్జ్(Premium Badge)