Toyota Innova Hycross : డాషింగ్​ లుక్​తో టయోటా ఇన్నోవా హైక్రాస్​..!-toyota innova hycross teased for the first time check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Toyota Innova Hycross Teased For The First Time, Check Details

Toyota Innova Hycross : డాషింగ్​ లుక్​తో టయోటా ఇన్నోవా హైక్రాస్​..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 25, 2022 11:26 AM IST

Toyota Innova Hycross : ఇన్నోవా హైక్రాస్​ టీజర్​ను విడుదల చేసింది టయోటా. వచ్చే నెలలో ఇది లాంచ్​ అవుతుందని సమాచారం.

టయోటా ఇన్నోవా హైక్రాస్​ ఫస్ట్​ లుక్​
టయోటా ఇన్నోవా హైక్రాస్​ ఫస్ట్​ లుక్​

Toyota Innova Hycross : ఇన్నోవా ఎంపీవీ కొత్త వర్షెన్​ను లాంచ్​ చేసేందుకు గత కొంతకాలంగా ప్రణాళికలు రచిస్తోంది టయోటా. దీనికి ఇన్నోవా హైక్రాస్​ అని పేరు పెట్టింది. ఇక ఇప్పుడు.. ఈ ఇన్నోవా హైక్రాస్​కు సంబంధించిన టీజర్​ను విడుదల చేసింది టయోటా ఇండోనేషియా.

ట్రెండింగ్ వార్తలు

ఇన్నోవా హైక్రాస్​ ఫ్రంట్​ డిజైన్​ మాత్రమే ఆ టీజర్​లో రిలీజ్​ చేశారు. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఇన్నోవా క్రిస్టాకు ఇది భిన్నంగా కనిపిస్తోంది. టయోటా కొరొల్లా క్రాస్​ వాహనాన్ని.. ఈ ఇన్నోవా హైక్రాస్​ ఫ్రంట్​ డిజైన్​ పోలి ఉంది. అప్​ రైట్​ హెక్సాగొనల్​ గ్రిల్​ ఇందులో ఉంటుంది. దీనితో ఇన్నోవా హైక్రాస్​ అపియరెన్స్​ మరింత డాషింగ్​గా మారుతుంది. బానెట్​ను చూస్తే.. కారు ఎంపీవీ అయినప్పటికీ, ఎస్​యూవీ లుక్​ వస్తోంది. ఇన్నోవా హైక్రాస్​లో మోనోకోక్యూ ఛాసీస్​ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇదే నిజమైతే.. వాహనం హ్యాండ్లింగ్​, రైడ్​ మెరుగ్గా ఉంటుంది. అదే సమయంలో బాడీ రోల్​ తగ్గుతుంది. ఇది ఫ్రంట్​ వీల్​ డ్రైవ్​ వెహికల్​గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫీచర్స్​ ఏంటి?

Toyota Innova Hycross features : ఇక ఫీచర్స్​ విషయానికొస్తే.. టయోటా ఇన్నోవా హైక్రాస్​లో 360డిగ్రీ కెమెరా, సన్​రూఫ్​, వైర్​లెస్​ ఛార్జింగ్​, రెండో రోలో కుర్చీలకు ఒట్టోమన్​ ఫంక్షనింగ్​ సిస్టెమ్​ ఉంటాయని సమాచారం. ఈ కారు పొడవు 4.7మీటర్లు, వీల్​బేస్​ 2,850ఎంఎం ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

ఇక వచ్చే నెలలో టయోటా ఇన్నోవా హైక్రాస్​ అంతర్జాకీయ మార్కెట్​లోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది.

Toyota Innova Hycross teaser : ఇన్నోవా హైక్రాస్​ను ఇండియా రోడ్ల మీద ఇప్పటికే టెస్ట్​ చేస్తోంది టయోటా. ఇన్నోవా క్రిస్టాతో పాటు ఇన్నోవా హైక్రాస్​ను కూడా సేల్​ చేయాలని చూస్తోంది. అయితే.. కొత్త వర్షెన్​లో పెట్రోల్​ వేరియంట్​ మాత్రమే ఉంటుందని సమాచారం. కాకపోతే.. కాస్త హైబ్రీడ్​ సిస్టెట్​ టచ్​ను ఇవ్వొచ్చు. ఇన్నోవా క్రిస్టా కూడా పెట్రోల్​ వర్షెన్​లోనే అందుబాటులో ఉంది. డీజిల్​ ఇంజిన్​కి సంబంధించి బుకింగ్స్​ను సంస్థ తీసుకోవడం లేదు.

సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే.. టయోటా ఇన్నోవా హైక్రాస్​ ఫీచర్స్​, ధర, లాంచ్​ డేట్​ వంటి వివరాలు స్పష్టమవుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్