Smart Phones : సూపర్ కెమెరా ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు-super camera features smartphones samsung and redmi phones available with huge discount ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smart Phones : సూపర్ కెమెరా ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Smart Phones : సూపర్ కెమెరా ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Anand Sai HT Telugu
Aug 07, 2024 11:00 AM IST

Smart Phones Discount : మంచి కెమెరా ఉన్న ఫోన్లను కొనాలి అనుకుంటే ఇదే సరైన సమయం. శాంసంగ్, రెడ్‌మీ ఫోన్లపై మంచి డిస్కౌంట్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా

మీరు గొప్ప కెమెరాతో ఉండే ఫోన్ కొనాలి అని ఆలోచిస్తుంటే అమెజాన్‌లో నడుస్తున్న గ్రేట్ ఫ్రీడమ్ సేల్ మీ కోసం ఎదురుచూస్తోంది. గ్రాండ్ ఫ్రీడమ్ ఫైండ్స్ డీల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో శాంసంగ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ ఏఐ భారీ డిస్కౌంట్లతో లభిస్తుంది. ఇది కాకుండా 200 మెగాపిక్సెల్ కెమెరాతో రెడ్‌మీ నోట్ 13 ప్రోను కూడా బెస్ట్ డీల్‌లో కొనుగోలు చేయవచ్చు. రెండింటిపై బ్యాంక్ ఆఫర్లతో మంచి క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది.

ఈఎంఐలపై కూడా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్లపై అందిస్తున్న డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం..

రెడ్‌మీ నోట్ 13 ప్రో

8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. ఈ సేల్లో రూ.2250 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కోసం ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఈ ఫోన్‌పై రూ.1250 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ.23,450కు తగ్గించుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఫొటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో మూడు కెమెరాలు ఉన్నాయి.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉంది. అదే సమయంలో సెల్ఫీల కోసం ఫోన్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. ఫోన్ డిస్ ప్లే 6.67 అంగుళాలు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ గా స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెమ్ 2ను కంపెనీ ఈ ఫోన్ లో అందిస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా, ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జీ ఏఐ

12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,24,999గా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఫోన్ కొంటే రూ.5,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ.6,250 వరకు క్యాష్ బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ.64,700 వరకు తగ్గించుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉండనున్నాయి.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. అదే సమయంలో ఫోన్ సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్. ఇందులో 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.