Stocks to buy today : స్టాక్స్ టు బై.. ఈ రూ. 590 స్టాక్‌తో భారీ లాభాలు పక్కా!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 617 పాయింట్లు పడి 73,885 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 216 పాయింట్లు పడి 22,488 వద్ద ముగిసింది. ఇక 181 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 48,682 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో ప్రస్తుతం ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల (జూన్ 4) వరకు ఇదే కొనసాగొచ్చు. 22,500 లెవల్స్ సపోర్ట్‌గా ఉన్నాయి. అక్కడి నుంచి కింద పడితే.. నిఫ్టీ 22,300- 22,100 లెవల్స్‌కి చేరే అవకాశం ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3050.15 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3432.92 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Stock market news today : ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్ 0.86శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.6శాతం, నాస్డాక్ 1.08శాతం నష్టపోయాయి.
స్టాక్స్ టు బై..
డిక్సాన్ టెక్నాలజీస్:- బై రూ. 9308, స్టాప్ లాస్ రూ. 900, టార్గెట్ రూ. 9900
Stocks to buy today list : ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:- బై రూ. 589.5, స్టాప్ లాస్ రూ. 568, టార్గెట్ రూ. 630.
పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్:- బై రూ. 748, స్టాప్ లాస్ రూ. 720, టార్గెట్ రూ. 780
బీఈఎల్:- బై రూ. 290, స్టాప్ లాస్ రూ. 282, టార్గెట్ రూ. 305
ఎస్కార్ట్స్:- బై రూ. 3856, స్టాప్ లాస్ రూ. 3780, టార్గెట్ రూ. 4050
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం