Stock market news today : వరుస లాభాలకు బ్రేక్​.. నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు-stock market news today 7th october 2022 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market News Today : వరుస లాభాలకు బ్రేక్​.. నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

Stock market news today : వరుస లాభాలకు బ్రేక్​.. నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

Sharath Chitturi HT Telugu
Oct 07, 2022 09:17 AM IST

Stock market news : దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ట్రేడ్​ అవుతున్నాయి.

<p>ఇండియా స్టాక్​ మార్కెట్​</p>
ఇండియా స్టాక్​ మార్కెట్​ (REUTERS)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 186 పాయింట్లు కోల్పోయి 58,036 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 52 పాయింట్ల నష్టంతో 17280 వద్ద ట్రేడ్​ అవుతోంది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్​ 157 వృద్ధిచెంది.. 58,222 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 58పాయింట్ల లాభంతో 17,332 వద్ద ముగిసింది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 58,096-17287 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్టు 17289- 17246 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 17,402-17472 వద్ద ఉంది.

స్టాక్​ మార్కెట్​ నిపుణులు ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ బుల్లిష్​గానే ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : ఇండియన్​ హోటల్స్​ కంపెనీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 303, టార్గెట్​ రూ. 380.
  • టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 97, టార్గెట్​ రూ. 112
  • వేదాంత:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 278, టార్గెట్​ రూ. 320.

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

 

అంతర్జాతీయ మార్కెట్లు..

అమెరికా స్టాక్​ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా నెలవారీ జాబ్​ డేటా శుక్రవారం వెలువడనుంది. ఇది మెరుగ్గా వస్తే.. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు ఇంకా ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా మాంద్యం వస్తుందన్న భయాలు కొనసాగుతున్నాయి.

డౌ జోన్స్​ 1.15శాతం, నాస్​డాక్​ 0.68శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.02శాతం మేర పతనమయ్యాయి.

ఆసియా మార్కెట్లు శుక్రవారం పడ్డాయి. జపాన్​ నిక్కీ 1.35శాతం, సౌత్​ కొరియా కాస్పి 0.8శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.64శాతం పతనమయ్యాయి.

చమురు ధరలు..

సప్లైని తగ్గించాలన్న ఒపెక్​ ప్లస్​ నిర్ణయంతో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్​ క్రూడ్​ 19సెంట్లు పెరిగి బ్యారెల్​కు 94.61డాలర్లకు చేరింది.

భారత ఆర్థిక వ్యవస్థ..

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను 6.5శాతానికి తగ్గించింది వరల్డ్​ బ్యాంక్​. గత త్రైమాసికంలో చేసిన అంచనాల కన్నా ఇది 1శాతం తక్కువగా ఉంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో.. ఎఫ్​ఐఐలు రూ. 279.01కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 43.92కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

Whats_app_banner

సంబంధిత కథనం