IPO listing time: ఐపీఓల లిస్టింగ్ కు ఇక మూడు రోజులే గడువు; సెబీ కొత్త రూల్స్
IPO listing time: ఐపీఓల లిస్టింగ్ కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఐపీఓలకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి, మూడు రోజుల్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని కొత్త నిబంధనలో స్పష్టం చేసింది.
IPO listing time: ఐపీఓల లిస్టింగ్ కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఐపీఓలకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి, మూడు రోజుల్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని కొత్త నిబంధనలో స్పష్టం చేసింది.
మూడే రోజులు..
ఐపీఓల లిస్టింగ్ గడువును దాదాపు సగానికి తగ్గిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఐపీఓకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి, ఆరు రోజుల్లోగా స్టాక్ మార్కెట్లో కంపెనీని లిస్ట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ గడువును ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గించారు. అంటే, ఐపీఓలకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి, మూడు రోజుల్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్య సాధనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, దీనివల్ల ఇన్వెస్టర్ల డబ్బు వారికి తిరిగి త్వరగా అందుబాటులోకి వస్తుంది.
దశల వారీగా..
అయితే, ఈ కొత్త నిబంధనను దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని సెబీ నిర్ణయించింది. మొదటి మూడు నెలలు, అంటే సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి నవంబర్ 30 వ తేదీ వరకు ఐపీఓ కు వస్తున్న కంపెనీలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని లేదు. వాటి వీలును బట్టి స్వచ్చంధంగా ఈ నిబంధనను అమలు చేయవచ్చు. కానీ, డిసెంబర్ 1 వ తేదీ నుంచి మాత్రం కచ్చితంగా ఐపీఓ ఆఫర్ డేట్ ముగిసిన రోజు నుంచి మూడు రోజుల లోపు స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ లిస్ట్ అయ్యేలా చూసుకోవాలి.