Reliance JioBook । దీపావళి సేల్.. డిస్కౌంట్ ధరకే రిలయన్స్ జియో ల్యాప్‌టాప్!
రిలయన్స్ జియో మొట్టమొదటి ల్యాప్‌టాప్ Reliance JioBook దీపావళి సందర్భంగా అమ్మకానికి వచ్చింది. తక్కువ ధరకే లభించే ల్యాప్‌టాప్ ఫీచర్లు, లభ్యత మొదలైన వివరాలు ఇక్కడ చూడండి.
రిలయన్స్ జియో ఈ నెల మొదటి వారంలో అత్యంత సరసమైన ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్ Reliance JioBookని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది కంపెనీ ప్రకటించలేదు. ఎట్టకేలకు దీపావళి కానుకగా దీనిని మార్కెట్లో విడుదల చేసింది.
ఈ కొత్త ఎంట్రీ-లెవల్ ల్యాప్‌టాప్ విద్యార్థులు, అధ్యాపకుల కోసం ఉద్దేశించి రూపొందించినది. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా కొనుగోలుదారులు ఈ కొత్త రిలయన్స్ జియోబుక్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 13,299 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Reliance JioBook ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంది. దానిపై Jio లోగోతో బ్రాండింగ్ కలిగి ఉంది. ఇదొక ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్, ఇది JioOS అని పిలిచే బ్రాండ్‌కు చెందిన స్వంత Android ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తుంది. అలాగే Adreno 610 GPUతో జత చేసిన Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో Microsoft యాడ్ బ్రౌజర్, Jio క్లౌడ్ PC వంటి యాప్‌లను అందిస్తున్నారు.
ఈ ల్యాప్‌టాప్ 2GB LPDDR4x ర్యామ్ , 32GB eMMC స్టోరేజ్‌ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా మెమరీని మరింత విస్తరించుకోవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌లో మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయి? ఎక్కడ కొనుగోలు చేయవచ్చు తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Reliance JioBook ల్యాప్‌టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 11.6-అంగుళాల HD డిస్‌ప్లే, 1366×768 పిక్సెల్‌ల రిజల్యూషన్
- 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్
- 2MP ఫ్రంట్ కెమెరా, అంతర్నిర్మిత స్టీరియో స్పీకర్లు
- 5000 mAh బ్యాటరీ
కనెక్టివిటీ పరంగా 4G, Jio Sim, USB-A 2.0 పోర్ట్, USB-A 3.0 పోర్ట్, HDMI పోర్ట్, WiFi ac, బ్లూటూత్ 5.0 ఉన్నాయి.
కంపెనీ తొలి ల్యాప్‌టాప్ అయిన Reliance JioBook అసలు ధర రూ. 35,605/- కాగా, ప్రస్తుతం రూ. రూ. 15,799/- ధరకే విక్రయిస్తున్నారు. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,500 వరకు తగ్గింపును పొందవచ్చు. కంపెనీ తొలి ల్యాప్‌టాప్ అయిన Reliance JioBook అసలు ధర రూ. 35,605/- కాగా, ప్రస్తుతం రూ. రూ. 15,799/- ధరకే విక్రయిస్తున్నారు.
రిలయన్స్ డిజిటల్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి JioBookఅందుబాటులో ఉంది. Reliance Digital వెబ్‌సైట్‌ను సందర్శించి దీనిని ఆర్డర్ చేయవచ్చు.
అక్టోబర్ మొదటివారంలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2022)లో రిలయన్స్ జియో తమ JioBook ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించిది. ఇప్పటి వరకు, జియోబుక్ ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జిఇఎమ్) ద్వారా కేవలం ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఈ JioBook కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేయటంతో మిగతా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
సంబంధిత కథనం
టాపిక్