Redmi 13C : అదిరిపోయే ఫీచర్స్‌తో రెడ్మీ 13సీ.. త్వరలోనే లాంచ్!
Redmi 13C : రెడ్మీ 13సీ ఫొటోలను అఫీషియల్‌గా రివీల్ చేసింది సంస్థ. అంతకుముందే.. కొన్ని ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు.
Redmi 13C : అంతర్జాతీయ మార్కెట్లో.. వరుస స్మార్ట్‌ఫోన్స్ లాంచ్‌కు సిద్ధమవుతోంది రెడ్మీ సంస్థ. వీటిల్లో.. రెడ్మీ 13సీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే.. ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఇటీవలే లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు.. ఈ మోడల్‌కి చెందిన ఫొటోలను రెడ్మీ సంస్థ అధికారికంగా రివీల్ చేసింది. ఆ విశేషాలు..
రెడ్మీ 13సీ విశేషాలు..
"రెడ్మీ 13సీ వచ్చేస్తోంది. చాలా కలర్ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. స్టైల్ ఫ్రెష్‌గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ స్టేబుల్‌గా ఉంటుంది. స్క్రీన్ స్మూత్‌గా ఉంటుంది," అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.
Redmi 13C launch date in India : రెడ్మీ రివీల్ చేసిన రెడ్మీ 13సీ స్మార్ట్‌ఫోన్ రేర్, ఫ్రెంట్ ప్యానెల్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెంట్లో వాటర్ డ్రాప్ నాచ్ కెమెరా డిజైన్ ఉంటుంది. రేర్‌లో బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, లైట్ బ్లూ షేడ్ కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. పోకో ఎఫ్5లోని స్నోస్టార్మ్ కలర్‌ను ఈ బ్లూ షేడ్ గుర్తుచేస్తోంది.
రెడ్మీ 13సీపై వచ్చిన లీక్స్ ప్రకారం.. ఈ మొబైల్లో 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఇక ఈ మోడల్ రైర్లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తుందని తెలుస్తోంది.
ఇదీ చూడండి:- Redmi Note 13 Pro+ : 200ఎంపీ కెమెరాతో.. రెడ్మీ నోట్ 13 ప్రో+
Redmi 13C release date : ఇక ఈ రెడ్మీ 13సీలో హీలియో జీ85 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ దీని సొంతం. మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా వస్తుండటం హైలైట్! ఆండ్రాయిడ్ 13 అధారిత ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టెమ్పై ఈ మోడల్ పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటివి ఇందులో భాగం.
Redmi 13C price in India : కాగా.. ఈ రెడ్మీ 13సీ లాంచ్ డేట్‌పై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ, త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. లాంచ్ డేట్ దగ్గర పడే కొద్దీ.. ఈ మోడల్‌కు చెందిన ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలపై ఓ క్లారిటీ వస్తుంది.
సంబంధిత కథనం