Realme P2 Pro : ధర తక్కువ- ఫీచర్స్ ఎక్కువ.. రియల్మీ పీ2 ప్రో హైలైట్స్ ఇవే
Realme P2 Pro launch : రియల్మీ పీ2 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ కొత్త గ్యాడ్జెట్ ఫీచర్స్, ధర, సేల్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో భారతీయ యువత కోసం కొత్త పీ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ని ఈ ఏడాది ప్రారంభంలో రియల్మీ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు, కొన్ని నెలల్లో, కంపెనీ రెండొవ తరం స్మార్ట్‌ఫోన్ రియల్మీ పీ2 ప్రో 5జీతో తిరిగొచ్చింది. యువ స్మార్ట్‌ఫోన్ యూజర్ల అభిరుచి కోసం రూపొందించిన కొత్త డిజైన్‌తో ఈ గ్యాడ్జెట్ వస్తోంది. అంతేకాకుండా సరసమైన ధరలో ఫ్లాగ్షిప్ తరహా అనుభవాన్ని అందిస్తామని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో రియల్మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రియల్మీ పీ2 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్..
రియల్మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7 ఇంచ్ శాంసంగ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్‌జెన్ 2 5జీ చిప్సెట్తో కనెక్ట్ చేసిన 12జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. మల్టీటాస్కింగ్ సమయంలో సమర్థవంతమైన హీట్ మేనేజ్మెంట్ కోసం 9 లేయర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఇందులో అమర్చింది సంస్థ.
రియల్మీ పీ2 ప్రో 5జీలో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు సోనీ లైట్-600 సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్‌తో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించింది సంస్థ. ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ స్మార్ట్ రిమూవల్, ఏఐ గ్రూప్ ఫోటో ఎన్హాన్స్మెంట్, ఏఐ ఆడియో జూమ్ వంటి పలు కెమెరా ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టెంపై రియల్మీ పీ2 ప్రో పనిచేయనుంది.
రియల్మీ పీ2 ప్రో 5జీ ధర, లభ్యత..
రియల్మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. అవి.. ప్యారెట్ గ్రీన్, ఈగిల్ గ్రే. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.21,999గా ఉంది. రూ.2000 కూపన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఇది స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గిస్తుంది.
రియల్మీ పీ2 ప్రో 5జీ ఎర్లీ బర్డ్ సేల్ సెప్టెంబర్ 17 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులు దీనిని ఫ్లిప్‌కార్ట్ లేదా రియల్మీ ఇండియా ఆన్లైన్ స్టోర్ నుంచి పొందవచ్చు.
రియల్మీ ప్యాడ్ 2 లైట్ లాంచ్..
రియల్మీ ప్యాడ్ 2 లైట్ టాబ్లెట్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. 10.95 ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ని ఇందులో అందించారు. ఇందులో భారీ 8300 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు. ఈ ట్యాబ్ స్మార్ట్ ఏఐ ఫంక్షనాలిటీని అందిస్తుంది. ఈ ట్యాబ్లెట్ రెండు రంగుల్లో, రెండు స్టోరేజ్ ఎంపికల్లో లభిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవవండి.
సంబంధిత కథనం