Oil India Q3 results: 100 శాతం డివిడెండ్ ప్రకటించిన నవరత్న కంపెనీ
Oil India Q3 results: భారత ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీల్లో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited OIL) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23) ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.
Oil India Q3 results: ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited OIL) భారత ప్రభుత్వ రంగ సంస్థ. అద్భుతమైన పనితీరు, సమర్ధ నిర్వహణ, మెరుగైన లాభాలు ఉన్న ‘నవరత్న’ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited OIL) కూడా ఒకటి.
Oil India Q3 results: 10 వేల కోట్ల ఆదాయం
భారత్ లోని ప్రభుత్వ రంగ గ్యాస్ అండ్ ఆయిల్ కంపెనీల్లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited OIL) రెండో అతిపెద్ద సంస్థ. ఈ కంపెనీని కేంద్ర ప్రభుత్వంలోని Petroleum and Natural Gas మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంటుంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited OIL) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23) ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ Q3 లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited OIL) ఆపరేషన్స్ ద్వారా రూ. 10,580.55 కోట్ల ఆదాయం సముపార్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 లో అది రూ. 7685.49 కోట్లు. అంటే ఆపరేషన్స్ రెవెన్యూలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ గత Q3 కన్నా 37.66% వృద్ధిని సాధించింది. అలాగే, ఈ Q3 లో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ (profit before tax PBT) రూ. 3264.01 అని OIL ప్రకటించింది. అలాగే, ఈ Q3 లో సంస్థ నికర లాభాలు రూ. 2284.41 కోట్లు కాగా, గత Q3 లో OIL నికర లాభాలు (net profit) రూ. 1297.79 కోట్లు. అంటే, గత Q3 తో పోలిస్తే, ఈ Q3 లో సంస్థ లాభాలు 76% పెరిగాయి.
Oil India Q3 results: 100% డివిడెండ్
ఈ ఆర్థిక సంవత్సరం రెండో ఇంటరిమ్ డివిడెండ్ (interim dividend) ను కూడా Oil India ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ. 10 ని (100% of paid-up capital) డివిడెండ్ (dividend) గా చెల్లించబోతున్నట్లు వెల్లడించింది. ఈ డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ డేట్ గా ఫిబ్రవరి 22వ తేదీని (record date) నిర్ణయించారు. అర్హులైన షేర్ హోల్డర్లకు మార్చి 12వ తేదీలోగా ఈ డివిడెండ్ (dividend) ను చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ షేర్ విలువ ఫిబ్రవరి 10 వ తేదీన 2.27% తగ్గింది. చివరకు రూ. 223.90 వద్ధ నిలిచింది.