Motorola layoffs: భారత్ లో మోటరోలా ఉద్యోగుల తొలగింపు; 3 వేల మందికి పింక్ స్లిప్స్-motorola confirms layoffs in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motorola Layoffs: భారత్ లో మోటరోలా ఉద్యోగుల తొలగింపు; 3 వేల మందికి పింక్ స్లిప్స్

Motorola layoffs: భారత్ లో మోటరోలా ఉద్యోగుల తొలగింపు; 3 వేల మందికి పింక్ స్లిప్స్

Sudarshan V HT Telugu
Sep 14, 2024 07:12 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత్ లోని తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 5% మందిని తొలగించాలని నిర్ణయించినట్లు ధ్రువీకరించింది.

భారత్ లో మోటరోలా ఉద్యోగుల తొలగింపు; 3 వేల మందికి పింక్ స్లిప్స్
భారత్ లో మోటరోలా ఉద్యోగుల తొలగింపు; 3 వేల మందికి పింక్ స్లిప్స్

అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా భారత్ లోని తమ ఉద్యోగుల్లో అత్యధికులకు లే ఆఫ్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. మోటోరోలా కు గుర్గావ్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి. భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో కనీసం 3,000 ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించినట్లు మోటొరోలా వెల్లడించింది.

మొత్తం ఉద్యోగాల్లో 5%

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 5% మందిని తొలగించాలని (layoff) నిర్ణయించినట్లు మొటొరోలా ధ్రువీకరించింది. అయితే, భారత్ లో ఎంతమందిని తొలగించబోతోందో కచ్చితమైన సంఖ్యను మొటోరోలా వెల్లడించలేదు. ‘‘తొలగింపు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సూత్రప్రాయంగా జరిగింది. ప్రతి మార్కెట్ కోసం వివిధ అంశాలను అంచనా వేస్తూ ఈ తొలగింపును అమలు చేయాలి’’ అని మోటరోలా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కమ్యూనికేషన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ హెడ్ అమిత్ చౌదరి తెలిపారు.

మళ్లీ నియామకం

ఆగస్టులో కంపెనీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ ఝా గూగుల్ పై ఆండ్రాయిడ్ (android) ఆపరేటింగ్ సిస్టం తో పాటు మరో రెండు సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫామ్ లపై దృష్టి పెట్టాలని నిర్ణయించిన తరువాత మోటరోలా ఇండియాలోని పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తిరిగి నియమించారు. మోటరోలా ఇండియా మరో రెండు కొత్త ఫోన్లను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది. ‘‘కంపెనీ అంతర్గతంగా వీలైనంత ఎక్కువ మందిని తిరిగి నియమించడానికి ప్రయత్నిస్తోంది, కానీ కొంతమందిని తొలగించాల్సి ఉంటుంది’’ అని మోటరోలా ఇండియాకు చెందిన ఒక అధికారి చెప్పారు.

రెండు ఆపరేటింగ్ సిస్టమ్ లపై..

మోటరోలా తన హ్యాండ్ సెట్ డిజైన్లలో అరడజనుకు పైగా ఆపరేటింగ్ సిస్టమ్ లపై ఆధారపడింది. గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మోటరోలా (motorola) ఇండియాకు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి. అమెరికాలోని షాంబర్గ్, ఇల్లినాయిస్ కు చెందిన మోటరోలా 3,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. అదే సమయంలో మూడవ త్రైమాసిక నికర నష్టాన్ని 397 మిలియన్ డాలర్లు (నేడు రూ .1,929 కోట్లు) ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ 60 మిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది.

800 మిలియన్ డాలర్లు ఆదా

ఈ లేఆఫ్ వల్ల ఏటా 800 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అంచనా. ఉద్యోగుల తొలగింపులో మూడింట రెండొంతుల మంది హ్యాండ్ సెట్ విభాగంలోనే ఉంటారని కంపెనీ కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రెగ్ బ్రౌన్ తెలిపారు. అక్టోబర్తో ముగిసిన త్రైమాసికంలో నోకియా, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్, సోనీ ఎరిక్సన్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఏబీ తర్వాత హ్యాండ్సెట్ మార్కెట్లో మోటరోలా నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అమెరికా సెల్ఫోన్ తయారీ సంస్థ తన మొబైల్ హ్యాండ్సెట్ వ్యాపారాన్ని వాయిదా వేసింది.