ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వకండి.. రూ.6,999కే మోటరోలా.. శాంసంగ్, వివో ఫోన్లు కూడా చౌకగా
Smart Phones : మీరు శాంసంగ్, మోటరోలా, వివో ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ సేల్‌ను అస్సలు మిస్ అవ్వకండి. తక్కువ ధరలో ఫోన్లు కొనొచ్చు. మూడు గొప్ప డీల్స్ ఉన్నాయి. కేవలం రూ .699కు కూడా కొత్త ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ గత సేల్‌లో డిస్కౌంట్‌తో స్మార్ట్ ఫోన్ కొనలేకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. ఆగస్టు 28 వరకు జరిగే ఈ సేల్‌లో దాదాపు అన్ని టాప్ కంపెనీల ఫోన్లను బెస్ట్ ఆఫర్లు, డీల్స్‌లో కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో మీరు శాంసంగ్, మోటరోలా, వివో ఫోన్ కోసం చూస్తుంటే మీకోసం మంచి ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వకండి.
మోటరోలా జీ04ఎస్
మోటరోలా జీ04ఎస్ 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,999గా నిర్ణయించారు. ఈ సేల్‌లో 5 శాతం క్యాష్ బ్యాక్‌తో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. రూ.247 ప్రారంభ ఈఎంఐతో ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.5,800 వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్లో మీరు 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను పొందుతారు. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం14 4జీ
ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,798గా ఉంది. 5 శాతం క్యాష్ బ్యాక్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. క్యాష్ బ్యాక్ కోసం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో చెల్లించాలి. బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్ రూ.1200 వరకు చౌకగా లభించనుంది. బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్ రూ.7778కే మీ సొంతం కానుంది. ఈ ఫోన్ ఈఎంఐ రూ.310 నుంచి ప్రారంభమవుతోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ అందిస్తోంది.
వివో టీ3 లైట్ 5జీ
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 4 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499గా ఉంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో ఈ సేల్‌లో ఫోన్ కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ రూ.370 నుంచి ప్రారంభమవుతోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్‌ను రూ.8,900 వరకు చౌకగా కొనుగోలు చేయవచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉండనున్నాయి.