Moto G13: 10 వేల లోపు ధరలో మోటో జీ 13 స్మార్ట్ ఫోన్
Moto G13: మోటో జీ 13 స్మార్ట్ ఫోన్ ను మోటొరోలా సంస్థ భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్క్రీన్ టు బాడీ రేషియో 89.47 శాతంగా ఉంది.
Moto G13: అందుబాటు ధరలో, ఆధునిక ఫీచర్లతో, స్ట్రాంగ్ బాడీతో స్మార్ట్ ఫోన్లను రూపొందించే మోటొరోలా సంస్థ తమ లేటెస్ట్ మోడల్ మోటో జీ 13 (Moto G13) ను భారత్ లో లాంచ్ చేయనుంది. ఇది 4 జీ స్మార్ట్ ఫోన్.
Moto G13: అందుబాటు ధర..
ఈ మోటో జీ 13 (Moto G13) స్మార్ట్ ఫోన్ 4జీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 9,499 లకే లభిస్తుంది. ఇందులో మీడియా టెక్ హీలియో జీ 85 (MediaTek Helio G85) ప్రాసెసర్ ను అమర్చారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి భారత్ లో ఈ ఫోన్ లభించనుంది. ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (flipkart) లో ఇది లభిస్తుంది.
Moto G13 features: మోటో జీ 13 ఫీచర్స్
ఈ మోటో జీ 13 (Moto G13) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 పై పని చేస్తుంది. ఇందులో మీడియా టెక్ హీలియో జీ 85 (MediaTek Helio G85) ప్రాసెసర్ ను అమర్చారు. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా లభిస్తుంది. ఇందులో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ హెచ్ డీ ప్లస్ రెజొల్యూషన్ డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ కెమెరా ఉన్నాయి. Moto G13 లో 10 వాట్ చార్జింగ్ ఫెసిలిటీతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.
Moto G73 5G: మోటో జీ73 5 జీ ఫోన్
మోటొరోలా ఇటీవలనే మోటో జీ 73 5జీ (Moto G73 5G) ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఇది రెండు రంగుల్లో లభిస్తుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు రియర్ కెమెరాలను అమర్చారు. ఇందులో 8 జీబీ ర్యామ్ తో ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 930 ఎస్ఓసీ ప్రాసెసర్ ను అమర్చారు. అలాగే, ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది.