Microsoft market cap: 3 ట్రిలియన్ డాలర్లు దాటిన మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్; పరుగులు తీస్తున్న ఎంఎస్ స్టాక్-microsofts market cap crosses 3 trillion dollars stock trades 52 week high ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Microsoft Market Cap: 3 ట్రిలియన్ డాలర్లు దాటిన మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్; పరుగులు తీస్తున్న ఎంఎస్ స్టాక్

Microsoft market cap: 3 ట్రిలియన్ డాలర్లు దాటిన మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్; పరుగులు తీస్తున్న ఎంఎస్ స్టాక్

HT Telugu Desk HT Telugu
Jan 25, 2024 02:07 PM IST

Microsoft market cap: టెక్నాలజీ దిగ్గజం మైక్రో సాఫ్ట్ షేర్లు బుధవారం నాస్ డాక్ లో 403.78 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. ఈ కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే 1.17% వృద్ధి సాధించాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Microsoft market cap: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 24న అధికారికంగా 3 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది. గత ఏడాది జూన్ లో ఈ రికార్డును సాధించిన ఐఫోన్ తయారీదారు ఆపిల్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండో కంపెనీగా టెక్ దిగ్గజం నిలిచింది.

3 ట్రిలియన్ డాలర్లు

గత ఏడాది 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన మొదటి కంపెనీ ఆపిల్ విలువను మైక్రోసాఫ్ట్ అధిగమించింది. కానీ, ఆ తరువాత మళ్లీ యాపిల్ మార్కెట్ క్యాప్ కన్నా తక్కువకు పడిపోయింది. 3 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ ను సాధించిన అనంతరం మైక్రోసాఫ్ట్ షేర్లు బుధవారం నాస్ డాక్ లో 1.17 శాతం వృద్ధితో 403.78 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మైక్రోసాఫ్ట్ షేరు 401.48 డాలర్ల వద్ద ప్రారంభమై, అంతకుముందు రోజు ముగింపు ధర 398 డాలర్లను అధిగమించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఓపెన్ఏఐ తో భాగస్వామ్యం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన లబ్ధిదారుల్లో ఒకటిగా మైక్రోసాఫ్ట్ మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను కంపెనీ ప్రవేశపెట్టడంతో, మార్కెట్ లో సానుకూలత పెరిగింది. క్లౌడ్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలకు డిమాండ్ పెరగడం మైక్రోసాఫ్ట్ సుస్థిర వృద్ధి పథంలో నిలుపుకునేందుకు కారణమైంది. బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ ఆదాయం దాదాపు 15%పెరిగే అవకాశముంది.

షేర్లకు ఫుల్ డిమాండ్

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ వాల్ స్ట్రీట్ లో అత్యంత డిమాండ్ ఉన్న స్టాక్స్ లో ఒకటిగా ఉంది. 90% కంటే ఎక్కువ మంది విశ్లేషకులు ఈ మైక్రోసాఫ్ట్ షేర్లను కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తారు. సగటున ప్రస్తుత స్థాయి నుండి సుమారు 7% వృద్ధి ఉంటుందని వారు కచ్చితంగా చెబుతున్నారు.

WhatsApp channel