Auto Expo: ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ‘సెల్ఫ్ బ్యాలెన్సింగ్’ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ప్రపంచంలో తొలిసారి ఈ టెక్నాలజీతో..-liger electric scooters with self balancing technology debut at auto expo 2023 check features price launch details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Auto Expo: ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ‘సెల్ఫ్ బ్యాలెన్సింగ్’ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ప్రపంచంలో తొలిసారి ఈ టెక్నాలజీతో..

Auto Expo: ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ‘సెల్ఫ్ బ్యాలెన్సింగ్’ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ప్రపంచంలో తొలిసారి ఈ టెక్నాలజీతో..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 11, 2023 01:52 PM IST

Liger Electric Scooters: లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఆటో ఎక్స్‌పో (Auto Expo 2023 )లో అడుగుపెట్టాయి. ప్రపంచంలోనే తొలిసారి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ (Self Balancing Technology)ని కలిగి ఉన్న స్కూటర్లుగా నిలిచాయి. ఈ స్కూటర్లు భారత మార్కెట్‍లో ఎప్పుడు లాంచ్ కానున్నాయి, ధర ఎలా ఉండనుందంటే..

Auto Expo 2023: ఆటో ఎక్స్‌పోలో లైగర్ ‘సెల్ఫ్ బ్యాలెన్సింగ్’ ఎలక్ట్రిక్ స్కూటర్లు
Auto Expo 2023: ఆటో ఎక్స్‌పోలో లైగర్ ‘సెల్ఫ్ బ్యాలెన్సింగ్’ ఎలక్ట్రిక్ స్కూటర్లు (HT Auto)

Liger Electric Scooters: ముంబైకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ లైగర్ మొబిలిటీ (Liger Mobility).. ఆటో ఎక్స్‌పో 2023లో ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించింది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ (Self Balancing Technology)తో రెండు స్కూటర్లను తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈ టెక్నాలజీ ఉండడం ప్రపంచంలో ఇదే తొలిసారి. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఉండడం వల్ల రైడర్లకు ఎంతో సెఫ్టీ, కంఫర్ట్ ఉంటుందని లైగర్ సంస్థ వెల్లడించింది. స్కూటర్ స్పీడ్‍ను బట్టి కూడా ఈ టెక్నాలజీ యాక్టివేట్, డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది. అలాగే, స్టాండ్ వేయకుండా కూడా ఈ స్కూటర్లు నిలబడగలవు. ఈ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎప్పుడు లాంచ్ కానున్నాయి.. ధర ఎంత ఉంటుంది, రేంజ్ సహా ఫీచర్లు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి.

Liger Electric Scooters: రెండు మోడళ్లు, లాంచ్ అప్పుడే!

లైగర్ మొబిలిటీ సంస్థ రెండు స్కూటర్లను ప్రదర్శించింది. లైగర్ ఎక్స్ (Liger X), లైగర్ ఎక్స్+ (Liger X+) పేర్లతో వీటిని తీసుకొచ్చింది. మరో ఐదు నెలల్లో భారత మార్కెట్‍లో ఈ స్కూటర్లు లాంచ్ కానున్నాయి. ఆ ఏడాది ముగిసేలోగా డెలివరీలను ప్రారంభించనుంది లైగర్ మొబిలిటీ.

అంచనా ధర

Liger Electric Scooters: లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రారంభ ధర రూ.90వేలుగా ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. లైగర్ ఎక్స్ ధర ఫేమ్-2 సబ్సిడీ తర్వాత రూ.90,000 (ఎక్స్-షోరూమ్) ఉంటుందని సమచాారం. లైగర్ ఎక్స్+ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

Liger Electric Scooters: వివరాలు

లైగర్ ఎక్స్, లైగర్ ఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్లు లిక్విడ్ కాల్డ్ లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్యాక్‍తో రానున్నాయి. భారత వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఈ బ్యాటరీలను తయారయ్యాయి. ఈ స్కూటర్ల టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లుగా ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే లైగర్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. లైగర్ ఎక్స్+ రేంజ్ 100 కిలోమీటర్లుగా ఉంటుందని సమాచారం. ఇక లైగర్ ఎక్స్ స్కూటర్ లోని బ్యాటరీ మూడు గంటల్లోగా, లైగర్ ఎక్స్+ బ్యాటరీ 4.5 గంటల్లోగా ఫుల్ చార్జ్ అవుతుంది.

ఈ రెండు లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 4జీ, జీపీఎస్ కనెక్టివిటీతో రానున్నాయి. ఫోన్‍కు కనెక్ట్ చేసుకొని కాల్స్, మెసేజ్‍లను ఈ స్కూటర్ల టీఎఫ్‍టీ డిస్‍ప్లేలో చెక్ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం