LIC Q1 Results: 14 రెట్లు పెరిగిన ఎల్ఐసీ లాభాలు; క్యూ 1 లో రూ. 9, 544 వేల కోట్ల నికర లాభాలు
LIC Q1 Results: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ఈ ఆర్థిక సంవత్సరం (Q1FY24) తొలి త్రైమాసికంలో అద్భుత ఫలితాలను సాధించింది. ఈ క్యూ 1 లో ఎల్ఐసీ రూ. 9,543.7 వేల కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1 (Q1FY23) తో పోలిస్తే, ఇవి దాదాపు 14 రెట్లు అధికం.
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (Life Insurance Corporation of India LIC) ఈ ఆర్థిక సంవత్సరం (Q1FY24) తొలి త్రైమాసికంలో అద్భుత ఫలితాలను సాధించింది. ఈ క్యూ 1 లో రూ. 9,543.7 వేల కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1 (Q1FY23) తో పోలిస్తే, ఇవి దాదాపు 14 రెట్లు అధికం. Q1FY23 లో ఎల్ఐసీ సాధించిన నికర లాభాలు రూ. 683 కోట్లు.
ఆదాయం 1.8 లక్షల కోట్లు..
ఈ క్యూ 1 లో ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ. 1,88,749 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం క్యూ 1లో ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ. 1,68,881 కోట్లుగా ఉంది. అలాగే, ఈ క్యూ 1 లో వివిధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఎల్ఐసీ రూ. 90,309 కోట్లను ఆర్జించింది. గత క్యూ 1 లో ఇది రూ. 69,571 కోట్లు. అలాగే, వివిధ బీమా పథకాల ప్రీమియం ద్వారా ఎల్ఐసీ సముపార్జించిన ఆదాయం రూ. 98,363 కోట్లు. గత క్యూ 1 లో ఇది రూ. 98,352 కోట్లు.
అమ్మిన పాలసీల సంఖ్య..
ఈ క్యూ 1 లో ఎల్ఐసీ మొత్తం 36,81,764 కొత్త పాలసీలను అమ్మగలిగింది. గత క్యూ 1 లో ఎల్ఐసీ అమ్మగలిగిన కొత్త పాలసీల సంఖ్య 32,16,301.మొత్తంగా మార్కెట్ షేర్ విషయానికి వస్తే, ఎల్ఐసీ మార్కెట్ షేర్ ఈ క్యూ 1 లో స్వల్పంగా తగ్గింది. ఈ క్యూ1 లో మంచి ఫలితాలను సాధించగలగడం సంతోషంగా ఉందని ఎల్ఐసీ చైర్ పర్సన్ సిద్ధార్థ మొహంతి తెలిపారు. కాగా, క్యూ1 ఫలితాల నేపథ్యంలో గురువారం ఎల్ఐసీ షేర్ విలువ 0.29% తగ్గి, రూ. 642.10 వద్ద ముగిసింది. కానీ, శుక్రవారం మళ్లీ పుంజుకుని మధ్నాహ్నం 1 గంట సమయానికి దాదాపు 3% పైగా పెరిగి రూ. 661 కి చేరింది.