Jawa 42 Bobber : రూ. 2.06 లక్షల ధరతో ఇండియాలో లాంఛ్ అయిన బ్రాండ్ న్యూ బైక్-jawa 42 bobber launched in india with rs 2 06 lakhs starting price here is the features and details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jawa 42 Bobber : రూ. 2.06 లక్షల ధరతో ఇండియాలో లాంఛ్ అయిన బ్రాండ్ న్యూ బైక్

Jawa 42 Bobber : రూ. 2.06 లక్షల ధరతో ఇండియాలో లాంఛ్ అయిన బ్రాండ్ న్యూ బైక్

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 01, 2022 08:09 AM IST

Jawa 42 Bobber : రూ. 2.06 లక్షల ప్రారంభ ధరతో.. బ్రాండ్ న్యూ జావా 42 బాబర్​ను ఇండియాలో లాంఛ్ చేశారు. మరి దీని ఇంజిన్, మోడల్ డిటైల్స్.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

<p>Jawa 42 Bobber</p>
Jawa 42 Bobber

Jawa 42 Bobber : Jawa Yezdi మోటార్‌సైకిల్స్‌ తయారు చేసిన సరికొత్త Jawa 42 Bobberను భారతదేశంలో లాంఛ్ చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2,06,500, రూ. 2,09,000. బైక్ షిప్‌మెంట్‌లు వచ్చే వారంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. కొత్త జావా 42 బాబర్ మూడు విభిన్న రంగుల్లో మనకు లభ్యమవుతుంది. అవి మూన్‌స్టోన్ వైట్, మిస్టిక్ కాపర్, డ్యూయల్-టోన్ జాస్పర్ రెడ్.

Jawa 42 Bobber మెరుగుదలలు, కస్టమైజింగ్ పెయింట్ స్కీమ్‌తో ఆగవు. మోటార్‌సైకిల్ ఎర్గోనామిక్స్, పనితీరు మెరుగుదలతో వచ్చింది. కొత్త Jawa 42 Bobberని Jawa Yezdi డీలర్‌షిప్‌ల ద్వారా ప్రివ్యూ చేసి కొనుగోలు చేయవచ్చు.

పెరాక్‌కి భిన్నంగా కొత్త 42 బాబర్ దూసుకుపోతోందని ఆ సంస్థ నిర్వాహకులు ధీమా వ్యక్తం చేశారు. కొత్త మోటార్‌బైక్ బాబర్ ఫండమెంటల్స్‌కు (సింపుల్ బాడీవర్క్, కట్ ఫెండర్‌లు, తక్కువ సింగిల్ సీట్, లావు టైర్లు) విధేయంగా ఉంటుంది. అయితే ఇది డిజైన్‌కు రంగు, ఫ్లెయిర్‌ను జోడిస్తుంది.

పెరాక్ 334 cc ఇంజన్ నుంచి 30.64 హార్స్‌పవర్, 32.74 Nm టార్క్ జావా 42 బాబర్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు బదిలీ చేశారు. తయారీదారు ప్రకారం.. మరింత ప్రతిస్పందించే అనుభవం కోసం కొత్త సస్పెన్షన్ ట్యూనింగ్, బ్రేక్ కాలిబ్రేషన్‌తో అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. 42 బాబర్ కాంటినెంటల్ టాప్-టైర్ డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ (ABS)తో అమర్చబడి ఉంటుంది.

క్లాసిక్ లెజెండ్స్ CEO ఆశిష్ సింగ్ జోషి కొత్త మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ.. “కొత్త 42 బాబర్ మాకు విజయగాథల సమ్మేళనం. జావా 42 అనేది ఆధునిక రెట్రో మోటార్‌సైకిల్‌పై మా చమత్కారమైన టేక్. ఇది యువతలో బాగా క్లిక్ అవుతుంది. అది మా అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌లలో ఒకటిగా మారబోతుంది. పెరాక్‌తో మేము దేశంలో సరికొత్త 'ఫ్యాక్టరీ కస్టమ్' విభాగాన్ని సృష్టించాము. దాని ప్రజాదరణ, అభిమానుల ఫాలోయింగ్ ఇప్పటికీ తగ్గలేదు. కొత్త 42 బాబర్​ను మేము విలక్షణమైన, స్టైలిష్, కస్టమ్ మోటార్‌సైకిల్‌ను కోరుకునే విస్తృత రైడర్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుని తయారు చేశాము." అని వెల్లడించారు.

Whats_app_banner

సంబంధిత కథనం