New 4G Feature Phone: తక్కువ ధరలో కొత్త 4జీ ఫీచర్ ఫోన్ లాంచ్.. స్పెసిఫికేషన్లు, ధర వివరాలు
Itel Magic X pro 4G feature phone: ఐటెల్ నుంచి మరో 4జీ ఫీచర్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వోల్ట్ సపోర్ట్, ఎఫ్ఎం రేడియో, 2,500ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది.
Itel Magic X pro 4G feature phone: 4జీ ఫీచర్ ఫోన్ కొనాలనుకునే వారి కోసం మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఐటెల్ బ్రాండ్ కీప్యాడ్‍తో మరో 4జీ ఫోన్‍ను లాంచ్ చేసింది. ఐటెల్ మ్యాజిక్ ఎక్స్ ప్రో 4జీ మొబైల్‍ను తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చింది. వైఫై హాట్‍స్పాట్ ఫీచర్ కూడా ఉంటుంది. ప్రీలోడెడ్ గేమ్స్, తెలుగు, తమిళం లాంటి మొత్తం 12 భారతీయ ప్రాంతీయ భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఐటెల్ మ్యాజిక్ ఎక్స్ ప్రో 4జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.
ఐటెల్ మ్యాజిక్ ఎక్స్ ప్రో 4జీ ధర, సేల్
Itel Magic X pro 4G Price: ఐటెల్ మ్యాజిక్ ఎక్స్ ప్రో 4జీ ఫీచర్ ఫోన్ ధర రూ.2,999గా ఉంది. ఆఫ్‍లైన్ రిటైల్ స్టోర్లతో పాటు ఆన్‍లైన్‍లోనూ ఈ మొబైల్‍ను అమ్మకానికి తెచ్చినట్టు ఐటెల్ వెల్లడించింది. రెండు సంవత్సరాల వారెంటీ ఉండటం ఈ ఫోన్‍కు ప్రత్యేకతగా ఉంది. బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ 4జీ బడ్జెట్ ఫీచర్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
ఐటెల్ మ్యాజిక్ ఎక్స్ ప్రో 4జీ స్పెసిఫికేషన్లు
Itel Magic X pro 4G Price: 4జీ కనెక్టివిటీతో పాటు వోల్ట్ (VOLTE)కి ఈ ఐటెల్ మ్యాజిక్ ఎక్స్ ప్రో 4జీ సపోర్ట్ చేస్తుంది. దీంతో వాయిస్ కాల్స్ చాలా క్లియర్ గా ఉంటాయని ఐటెల్ పేర్కొంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, గుజరాతీ, కన్నడ, పంజాబీ, బెంగాళీ, ఒడియా, అస్సామీ, ఉర్దూ సహా మొత్తంగా 12 భారతీయ భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
2.4 ఇంచుల క్యూవీజీఏ డిస్‍ప్లేను ఐటెల్ మ్యాజిక్ ఎక్స్ ప్రో 4జీ ఫీచర్ ఫోన్ కలిగి ఉంది. వెనుక ఓ వీజీఏ కెమెరా ఉంటుంది. 64MB ర్యామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్‍తో ఈ ఫోన్‍లో వస్తోంది. డ్యుయల్ సిమ్ సపోర్ట్, ప్రీలోడెడ్ యాప్స్ కూడా ఉంటాయి. ఈ మొబైల్‍లో బూ ప్లే అనే యాప్ ఉంటుంది. దీంట్లోనే ఎఫ్‍ఎం రేడియో, ప్రీలోడెడ్ పాటలతో పాటు ఆన్‍లైన్ ద్వారా 74 మిలియన్ సాంగ్స్ ను వినవచ్చని ఐటెల్ వెల్లడించింది.
ఐటెల్ మ్యాజిక్ ఎక్స్ ప్రో 4జీ ఫీచర్ ఫోన్‍లో 2,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 8 ప్రీలోడెడ్ గేమ్స్ ఈ ఫోన్‍లో ఉంటాయి. కింగ్ వాయిస్ అసిస్టెంట్‍కు ఈ బడ్జెట్ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. Itel Magic X pro 4G బాక్సులో చార్జర్ తో పాటు వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉంటుంది.