iQoo 11 5G: అదిరిపోయే స్పెసిఫికేషన్లతో ఐకూ 11 5జీ వచ్చేసింది: ధర, ఆఫర్ల వివరాలివే
iQoo 11 5G launched in India: ఐకూ 11 5జీ ఇండియాలో అడుగుపెట్టింది. ఫ్లాగ్‍షిప్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెసర్‌తో భారత్‍లో లాంచ్ అయిన తొలి మొబైల్‍గా నిలిచింది. అన్ని విభాగాల్లోనూ ప్రీమియమ్ ఫీచర్లతో ఉంది. ఐకూ 11 5జీ ధర (iQoo 11 5G price in India), ఆఫర్, స్పెసిఫికేషన్ల వివరాలపై ఓ లుక్కేయండి.
iQoo 11 5G launched in India: 2023లో తొలి ఫ్లాగ్‍షిప్ మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. ఐకూ 11 5జీ ఫోన్ భారత్‍లో మంగళవారం (జనవరి 10) విడుదలైంది. పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఫ్లాగ్‍షిప్ కెమెరా సెన్సార్లతో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. క్వాడ్ హెచ్‍డీ+ డిస్‍ప్లే మరో ఆకర్షణగా ఉంది. మొత్తంగా అన్ని విభాగాల్లో ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను ఈ ఫోన్ కలిగి ఉంది. ఐకూ 11 5జీ ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.
ఐకూ 11 5జీ స్పెసిఫికేషన్లు
iQoo 11 5G Specifications: 6.7 ఇంచుల 2K క్వాడ్ హెచ్‍డీ రెజల్యూషన్ ఆమోలెడ్ LTPO 4.0 డిస్‍ప్లేను ఐకూ 11 5జీ కలిగి ఉంది. హెచ్‍డీఆర్10+, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటాయి. ఇమేజింగ్, గేమింగ్ మరింత మెరుగ్గా ఉండేలా ప్రత్యేకంగా వీ2 చిప్‍తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. ఈ నయా ప్రాసెసర్‌తో ఇండియాలో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదే. ఆండ్రాయిడ్ 13 (Android 13) బేస్డ్ ఫన్‍టచ్ ఓఎస్‍తో ఐకూ 11 5జీ వస్తోంది.
iQoo 11 5G ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 8 నిమిషాల్లోనే ఈ ఫోన్ 0 నుంచి 50 శాతం చార్జ్ అవుతుందని ఐకూ పేర్కొంది. డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్, ఎన్‍ఎఫ్‍సీ.. కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, వైఫై ఆడియో, ఇన్‍డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
iQoo 11 Cameras: ఐకూ 11 వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ సామ్‍సంగ్ GN5 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 13 మెగాపిక్సెల్ 2x టెలిఫొటో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఐకూ నయా ఫ్లాగ్‍షిప్ ఫోన్ వస్తోంది.
ఐకూ 11 5జీ ధర, సేల్, ఆఫర్లు
iQoo 11 5G Price in India: 8GB ర్యామ్ +256GB స్టోరేజ్ ఉన్న ఐకూ 11 5జీ బేస్ మోడల్ ధర రూ.59,999, 16GB ర్యామ్ +256GB స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర రూ.64,999గా ఉంది. ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఐకూ వెబ్‍సైట్ (iqoo.com)లో ఐకూ 115జీ సేల్‍కు వస్తుంది. ఆల్ఫా, లెజెండ్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది.
iQoo 11 5G Offer: ఐసీఐసీఐ, హెచ్‍డీఎఫ్‍సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఐకూ 11 5జీని కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ వినియోగించుకుంటే బేస్ వేరియంట్‍ను రూ.54,499కు దక్కించుకోవచ్చు. అలాగే ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.