International Women's Day 2023: మహిళల ఆర్థిక స్వతంత్రతకు 4 సూత్రాలు
Women's Day special: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఆర్థిక భద్రత, ఆర్థిక స్వతంత్రత కోసం మహిళలు ఫాలో కావాల్సిన నాలుగు సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
women's financial security tips: మహిళలకు ఆర్థిక భద్రత, ఆర్థిక స్వతంత్రత ఇచ్చే ధైర్యం, ఆత్మ విశ్వాసం ఎనలేనిది. కావాలంటే, ఆర్థికంగా స్వంత కాళ్లపై నిలబడిన ఏ మహిళనైనా అడగండి. ఆర్థిక స్వతంత్రత ఎంత ముఖ్యమో చెబుతారు. అందుకే ప్రతీ మహిళ వీలైన స్థాయిలో సొంతంగా ఆర్థిక స్వతంత్రత పొందే మార్గాలను వెతుక్కోవాలి. పాటించాలి. ఈ దిశగా నిపుణులు సూచిస్తున్న సూత్రాలివి..
women's financial security tips: ఈ నాలుగు సూత్రాలు పాటించండి..
- ఉద్యోగం చేసే వారైతే, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం మానేయొద్దు. ఉద్యోగం చేస్తుండడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తాత్కాలికమే కానీ, ఉద్యోగం మానేస్తే, తలెత్తే సమస్యలు శాశ్వతం.
- సంపాదనలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. పెట్టుబడులు పెట్టాలంటే, పెద్ద మొత్తమే ఉండనక్కరలేదు. అలాగే, ఇన్వెస్ట్ చేయడానికి మీరు ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్ కానక్కరలేదు. మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ పై సలహాలు ఇచ్చే ఎక్స్ పర్ట్స్ చాలామందే ఉన్నారు. కొన్ని సంస్థలు కూడా ఇన్వెస్ట్మెంట్ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తాయి. సరైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ను ఎంపిక చేసుకోండి.
- ముందుగా, ఆర్థిక స్వతంత్రత విషయంలో మీ లక్ష్యాలేమిటో గుర్తించండి. అవి రిటైర్ మెంట్ కోసం జాగ్రత్త చేసుకోవడం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు.. వాటిని రాసి పెట్టుకోండి. ఆ తరువాత వాటిని సాధించే మార్గాలేమిటో అన్వేషించండి. మీకు వీలైన మార్గాన్ని లేదా మార్గాలను ఎంపిక చేసుకోండి. ఎప్పటికప్పుడు విజయాలు, వైఫల్యాలను విశ్లేషించుకుంటూ, అవసరమైన మార్పులు చేసుకోండి.
- సంపాదనలో కొంత మొత్తాన్ని డైవర్సిఫైడ్ పోర్ట్ ఫోలియో లో పెట్టుబడిగా పెట్టండి. అవి స్టాక్స్ కావచ్చు.. బాండ్స్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇతర ఆస్తులేమైనా కావచ్చు. అయితే, ఆ పెట్టుబడులు మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగపడేలా ఉండాలి. పెట్టుబడులు పెట్టే సమయంలో భావోద్వేగాలకు చాన్స్ ఇవ్వవద్దు. అవసరమైతే, ఎక్స్ పర్ట్ సలహాలు తీసుకోండి. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడులను విశ్లేషించుకుని, అవసరమైన మార్పులు చేసుకోండి.
(సూచన: ఇవి నిపుణుల సూచనలు, అభిప్రాయాలు మాత్రమే.)
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.