Exchange torn currency notes: చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంక్ ల్లో మార్చుకోవడానికి ఈ ప్రొసీజర్ ఫాలో కండి..-how to exchange torn currency notes bank branches procedure limit and details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Exchange Torn Currency Notes: చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంక్ ల్లో మార్చుకోవడానికి ఈ ప్రొసీజర్ ఫాలో కండి..

Exchange torn currency notes: చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంక్ ల్లో మార్చుకోవడానికి ఈ ప్రొసీజర్ ఫాలో కండి..

HT Telugu Desk HT Telugu
May 14, 2024 02:58 PM IST

Exchange torn currency notes: ఎక్కువ కాలంగా వినియోగంలో ఉన్న కరెన్సీ నోట్లు, సరైన నిర్వహణ లేని కరెన్సీ నోట్లు చిరిగి పోతుంటాయి. చిరిగి పోయిన నోట్లకు విలువ లేదని పడేయకండి. వాటిని బ్యాంక్ శాఖల్లో, ఆర్బీఐ ఆఫీస్ ల్లో ఉచితంగా మార్పిడి చేసుకోవచ్చు. అయితే, అందుకు కొన్ని షరతులు ఉన్నాయి.

చిరిగిపోయిన కరెన్సీ నోట్లను ఇలా మార్చుకోండి..
చిరిగిపోయిన కరెన్సీ నోట్లను ఇలా మార్చుకోండి..

Exchange torn currency notes: చిరిగిపోయిన కరెన్సీ నోట్లను చాలా మంది పడేయడమో లేక అలా పక్కన పెట్టేయడమో చేస్తుంటారు. కొంతమంది చిరిగిపోయిన నోట్లను తీసుకుని కొంత కమిషన్ తీసుకుని, ఆ కరెన్సీ నోటు కన్నా తక్కువ విలువను ఇస్తుంటారు. అలా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా బ్యాంక్ శాఖలో చిరిగిపోయిన నోట్లను ఉచితంగా మార్పిడి చేసుకోవచ్చు. అయితే, అందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

చిరిగిపోయిన నోట్లను మార్చుకోవడం ఎలా?

దేశవ్యాప్తంగా ఏ బ్యాంకుల్లోనైనా చెడిపోయిన లేదా చిరిగిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెబ్సైట్ ప్రకారం, ‘మురికి నోటు (soiled note)’ అంటే సాధారణ అరుగుదల కారణంగా మురికిగా మారిన కరెన్సీ నోటును, లేదా రెండు ముక్కలుగా చిరిగిన కరెన్సీ నోటును బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే, రెండు ముక్కలుగా చిరిగిన నోటులో.. ఆ రెండు ముక్కలు కూడా ఒకే నోటువి అయి ఉండాలి. వాటి ముఖ్యమైన ఫీచర్స్ ఏవీ మిస్ కాకూడదు. అలాంటి నోట్స్ ను బ్యాంక్ లు నిరభ్యంతరంగా మార్పిడి కోసం స్వీకరిస్తాయి.

నోట్ల మార్పిడికి వర్తించే నియమాలు ఏమిటి?

వ్యక్తులు రోజుకు గరిష్టంగా రూ.5,000 విలువ చేసే 20 నోట్లను బ్యాంకుల్లో ఉచితంగా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు మార్పిడి చేసే కరెన్సీ నోట్ల విలువ రూ. 5 వేలు దాటినా, లేదా ఆనోట్ల సంఖ్య 20 దాటినా.. బ్యాంక్ లు వాటిని స్వీకరిస్తాయి. కానీ, వాటి మార్పిడికి సర్వీస్ చార్జ్ ను వసూలు చేస్తాయి. ఒకవేళ ఆ నోట్ల విలువ రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే.. బ్యాంకులు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాయి.

Whats_app_banner