GPT Healthcare IPO: ఈ రోజు నుంచే జీపీటీ హెల్త్ కేర్ ఐపీఓ; జీఎంపీ ఎంత అంటే?
GPT Healthcare IPO: ప్రతీ రోజు ఒక సరికొత్త ఐపీఓ మార్కెట్లోకి వస్తోంది. తాజాగా, జీపీటీ హెల్త్ కేర్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ గురువారం ప్రారంభమైంది. జీపీటీ హెల్త్ కేర్ సంస్థ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల చైన్ ను నిర్వహిస్తోంది.
జీపీటీ హెల్త్ కేర్ ఐపీఓ: జీపీటీ హెల్త్ కేర్ లిమిటెడ్ ఐపీఓ నేడు భారత ప్రైమరీ మార్కెట్ లో ప్రవేశించింది. ఫిబ్రవరి 26 వరకు ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.ఈ మిడ్ సైజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.177 నుంచి రూ.186గా నిర్ణయించింది. ఈ ఐపీఓకు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.157.54 కోట్లు సేకరించారు.
జిపిటి హెల్త్ కేర్ ఐపీఓ వివరాలు
- ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 177 నుంచి రూ.186.
- ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఐపీఓ కు అప్లై చేసుకోవచ్చు.
- ఈ ఐపీఓ ద్వారా రూ.525.14 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ నుంచి రూ. 40 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.485.14 కోట్లు సమీకరించనున్నారు.
- ఈ ఐపీఓకు లాట్స్ లో అప్లై చేసుకోవాలి. ఒక్కో లాట్ లో 80 ఈక్విటీ షేర్స్ ఉంటాయి.
- ఈ ఐపీఓ షేర్స్ అలాట్మెంట్ ఫిబ్రవరి 27న జరుగుతుంది. ఫిబ్రవరి 29న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది.
- గురువారం, ఫిబ్రవరి 22న ఈ ఐపీఓ షేర్ల జీఎంపీ రూ.0 గా ఉంది. అంటే, ఈ షేర్లు గ్రే మార్కెట్లో అటు ప్రీమియంతో కానీ, ఇటు డిస్కౌంట్ లో కానీ ట్రేడ్ కావడం లేదు.
అప్లై చేయాలా వద్దా?
ఈ ఐపీఓకు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రాజన్ షిండే 'సబ్ స్క్రైబ్' ట్యాగ్ ఇచ్చారు. ‘‘జీపీటీ హెల్త్ కేర్ లిమిటెడ్ పెట్టుబడిదారులకు అనుకూలమైన పెట్టుబడి అవకాశాన్ని ఇస్తుందని విశ్వసిస్తున్నాము. తూర్పు భారత నగరాల్లోని మూడు ప్రధాన సిటీస్ లో ఈ హాస్పిటల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి’’ అన్నారు. ఈ సంస్థ ఆదాయం 2022 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 ఆర్థిక సంవత్సరం మధ్య స్వల్పంగా 7 శాతం పెరగ్గా, పన్ను అనంతర లాభం -6.37 శాతం స్వల్పంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓ కు ‘అవాయిడ్’ ట్యాగ్ ను స్టోక్స్ బాక్స్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రథమేష్ పి మస్దేకర్ ఇచ్చారు.