Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..-gold and silver prices today on 13 03 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 13-03-2024 : Check Latest Rates In Your City

Gold and silver prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

HT Telugu Desk HT Telugu
Mar 13, 2024 09:15 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 60,730 గా ఉంది. సోమవారం ఈ ధర రూ. 60, 740 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,07,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,073గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 66,250 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,62,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,625గా ఉంది.

బెంగళూరులో బంగారం ధర

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,880 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,400 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,730 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 66,250గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,480గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 67,080గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 60,730 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 66,250గాను ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధర..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,730 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,250 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,780గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 66,300గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,730గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,250గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర కూడా..

దేశంలో వెండి ధరలు బుధవారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,620 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 700 పెరిగి రూ. 76,200 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 75,500 గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 79,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,200.. బెంగళూరులో రూ. 75,100గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల ప్లాటినం ధర బుధవారం రూ. 24,790 కి చేరుకుంది. ఇది మంగళవారం నాటి ధర అయిన రూ. 24,310 కన్నా రూ. 480 ఎక్కువ.

ఇక హైదరాబాద్​లో కూడా ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 24,790 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel