Gold and silver prices Today: బంగారం కొనాలనుకుంటున్నారా?.. ఇదే రైట్ టైమ్..-gold and silver prices today on 07 12 2023 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 07-12-2023 : Check Latest Rates In Your City

Gold and silver prices Today: బంగారం కొనాలనుకుంటున్నారా?.. ఇదే రైట్ టైమ్..

HT Telugu Desk HT Telugu
Dec 07, 2023 09:56 AM IST

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు గురువారం స్థిరంగా కొనసాగాయి. వెండి ధరల్లో కూడా మార్పు లేదు. ఆ వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు గురువారం స్థిరంగా కొనసాగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 57,450 వద్ద కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే ధర ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,74,500 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,745గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 62,700 గా కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే ధర ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,27,000 గా ఉంది.

ప్రధాన నగరాల్లో..

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఈ విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,600 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,820 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,450 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,700 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,440 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,450గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,700 గాను ఉంది.

హైదరాబాద్ లో..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,450 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,700 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,500 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,720 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,450గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,700 గా ఉంది.

ఇజ్రాయెల్​ పాలస్తీనా యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,820 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 78,200 గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఈ ధర ఇలాగే ఉంది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 81,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 78,200.. బెంగళూరులో రూ. 77,250గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel