August 1st Rules Change : ఆగస్టు 1 నుంచి వచ్చే ఈ రూల్స్‌తో మీ జేబుపై ప్రభావం.. చూసుకోండి మరి
Rules Changes From 1 August : ఎల్పీజీ సిలిండర్ల నుంచి క్రెడిట్ కార్డుల వరకు ఆగష్టు 1 నుండి పెద్ద మార్పులు జరుగుతాయి. మీ జేబుపై ప్రభావం చూపుతుంది. అవేంటో చూద్దాం..
జూలై నెల అయిపోయింది. ఆగస్టు 1 కొత్త నెలలోకి వచ్చేశాం. ఒక్కోసారి నెల ప్రారంభంలో అనేక రకాల నియమాలలో మార్పులు ఉంటాయి. వీటితో సామాన్యుడిపై ప్రభావం చూపిస్తుంది. వాస్తవానికి ఈ నెల ప్రారంభంలో పలు ప్రభుత్వ, ఆర్థిక సంస్థలు తమ నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల సామాన్యుల జేబుపై నేరుగా ప్రభావం పడుతోంది. అటువంటి పరిస్థితిలో, ఆగస్టు నెలలో మార్పు గురించి మీరు తెలుసుకోవాలి. ఆగస్టు 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, గూగుల్ మ్యాప్స్ సేవలు, క్రెడిట్ కార్డుల వరకు పలు నిబంధనలు మారబోతున్నాయి.
ఎల్పీజీ
సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతుంటాయి. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించారు. దీంతో ఈ నెలలో కూడా డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల ధరలు మరోసారి తగ్గుతాయని పలువురు భావిస్తున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్
ఆగస్టు 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు రూల్స్‌ను మారుస్తోంది. వచ్చే నెల నుంచి బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లు థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ ద్వారా జరిపే అన్ని రెంటల్ లావాదేవీలపై 1శాతం మొత్తాన్ని గరిష్టంగా రూ.3,000 పరిమితితో వసూలు చేస్తారు. పేటీఎం, సీఆర్ ఈడీ, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ లను ఉపయోగించి చేసే రెంటల్ లావాదేవీల మెుత్తం మీద 1 శాతం ఛార్జ్ ఉంటుంది. యుటిలిటీ ట్రాన్సాక్షన్స్ విషయానికొస్తే, రూ. 50000 కంటే తక్కువ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. అయితే రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీలకు 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. ప్రతి లావాదేవీకి రూ.3000 పరిమితి ఉంది.
అదే సమయంలో ఇంధన లావాదేవీలపై 15,000 కంటే ఎక్కువ లావాదేవీలకు 1 శాతం రుసుము వసూలు చేస్తారు. క్రెడ్, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలపై 1 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. ప్రతి లావాదేవీకి రూ.3,000 పరిమితి ఉంది.
గూగుల్ మ్యాప్స్
ఆగస్టు 1 నుంచి గూగుల్ మ్యాప్స్ ఇండియాలో కీలక మార్పులు చేస్తోంది. వచ్చే నెల నుండి, టెక్ దిగ్గజం తన సర్వీస్ ఛార్జీని 70శాతం తగ్గిస్తోంది, తద్వారా ఎక్కువ మంది సర్వీస్ ప్రొవైడర్లు గూగుల్ మ్యాప్‌ను ఉపయోగించవచ్చు. అలాగే ఈ సేవను ఉపయోగించే సంస్థల నుండి భారతీయ రూపాయలలో చెల్లింపు స్వీకరిస్తారు. అయితే సాధారణ వినియోగదారులు కొత్త ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
పాస్టాగ్ కేవైసీ
ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ కేవైసీ తప్పనిసరి. ఇప్పటికే అనేక నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ ఫాస్టాగ్ కోసం కొత్త కేవైసీ అవసరం. ఆగస్టు 1 నుంచి కంపెనీలు ఎన్ పీసీఐ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలలో మూడు నుండి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఫాస్టాగ్ కోసం కేవైసీని అప్డేట్ చేయడం, అక్టోబర్ 31లోగా ఐదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఫాస్టాగ్‌ను మార్చడం ఉన్నాయి.
సీఎన్జీ-పీఎన్జీ రేట్లు మారనున్నాయి
దేశవ్యాప్తంగా నెల మొదటి తేదీన ఎల్పీజీ సిలిండర్ల ధరలలో మార్పుతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు విమాన ఇంధనం, సీఎన్జీ-పీఎన్జీ రేట్లను కూడా సవరిస్తాయి.
ఐటీఆర్ జరిమానా
2024 జూలై 31 ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ. అటువంటి పరిస్థితిలో మీరు మిస్ అయితే ఆగస్టు 1 నుంచి ఐటీఆర్ దాఖలు చేయడానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.