New Smartwatch: 4జీబీ స్టోరేజ్‍తో ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్.. వాచ్‍లోనే పాటలు వినొచ్చు
Fire-Boltt Infinity Smartwatch: ఫైర్ బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. 4జీబీ స్టోరేజీని కలిగి ఉండడం ఈ వాచ్‍కు ప్రత్యేకతగా ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ వాచ్ సేల్ కూడా మొదలైంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇవే.
Fire-Boltt Infinity Smartwatch: దేశీయ కంపెనీ ఫైర్ బోల్ట్ వరుస పెట్టి స్మార్ట్‌వాచ్‍లను మార్కెట్‍లోకి తీసుకొస్తోంది. విభిన్నమైన ఫీచర్లతో వాచ్‍లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే ఫైర్ బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. 4జీబీ స్టోరేజీతో వస్తుండడం ఈ వాచ్‍కు ప్రత్యేకతగా ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. రౌండ్ షేప్ హెచ్‍డీ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఈ వాచ్ కలిగి ఉంది. ఫైర్ బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.
ఫైర్ బోల్డ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Fire-Boltt Infinity Smartwatch Specifications: 4జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఫైర్ బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ వస్తోంది. ఈ వాచ్‍లో 300 వరకు పాటలను స్టోర్ చేసుకోవచ్చని ఫైర్ బోల్ట్ పేర్కొంది. దీంతో ఈ వాచ్‍కు ఉండే స్పీకర్ ద్వారానే పాటలను వినవచ్చు. అలాగే బ్లూటూత్ ద్వారా టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను ఈ వాచ్‍కు కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్‍లకు కూడా ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
400x400 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ డిస్‍ప్లేను ఈ ఫైర్ బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. 110 వాచ్ ఫేస్‍లు అందుబాటులో ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ వాచ్ వస్తోంది. దీంతో మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు నేరుగా ఈ వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‍లకు ఈ ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్ కాంపాటిబుల్‍గా ఉంటుంది.
హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ SpO2 మానిటరింగ్ లాంటి హెల్త్ ఫీచర్లను ఫైర్ బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 300 స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం ఐపీ67 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ వాచ్ మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఫైర్ బోల్ట్ పేర్కొంది. మొత్తంగా ఈ వాచ్ 50 గ్రాముల బరువు ఉంటుంది.
ఫైర్ బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ధర, సేల్
Fire-Boltt Infinity Smartwatch Price: ఫైర్ బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ధర రూ.4,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ ఇప్పటికే సేల్‍కు వచ్చేసింది. బ్లాక్, గోల్డ్, సిల్వర్, గ్రే, గోల్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తోంది.
టాపిక్