Pournami Rashi Phalalu : ఈ రాశుల వారికి పూర్ణిమ రోజు శుభదాయకం.. ధన లాభం, సంతాన భాగ్యం కలగవచ్చు..!-pournami rashi phalalu these three zodiac signs will get more benefits improves wealth and may give birth to child ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pournami Rashi Phalalu : ఈ రాశుల వారికి పూర్ణిమ రోజు శుభదాయకం.. ధన లాభం, సంతాన భాగ్యం కలగవచ్చు..!

Pournami Rashi Phalalu : ఈ రాశుల వారికి పూర్ణిమ రోజు శుభదాయకం.. ధన లాభం, సంతాన భాగ్యం కలగవచ్చు..!

Peddinti Sravya HT Telugu
Dec 14, 2024 12:48 PM IST

Pournami Rashi Phalalu: పౌర్ణమిని 2024 డిసెంబర్ 15న జరుపుకుంటారు. విశ్వాసాల ప్రకారం, ఈ రోజున లక్ష్మీదేవి, విష్ణువు, చంద్రుడుని పూజిస్తారు. సంవత్సరంలోని చివరి పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం, శుభయోగం ఏర్పడుతున్నాయి, ఇవి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.

Pournami Rashi Phalalu : ఈ రాశుల వారికి పూర్ణిమ రోజు శుభదాయకం
Pournami Rashi Phalalu : ఈ రాశుల వారికి పూర్ణిమ రోజు శుభదాయకం (pixabay)

డిసెంబర్ నెలలో సంవత్సరంలో చివరి పౌర్ణమి వస్తోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనదిగా భావిస్తారు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని 2024 డిసెంబర్ 15న జరుపుకుంటారు. విశ్వాసాల ప్రకారం, ఈ రోజున లక్ష్మీదేవి, విష్ణువు, చంద్రుడుని పూజిస్తారు. సంవత్సరంలోని చివరి పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం, శుభయోగం ఏర్పడుతున్నాయి, ఇవి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.

ఈ రోజున సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల యొక్క శుభ స్థానం, శుభ యోగం ఏర్పడటం వల్ల, పౌర్ణమి రోజు కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఏయే రాశుల వాళ్లకు మంచి జరగనుంది అనేది తెలుసుకుందాం. మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి పౌర్ణమి రోజు ప్రయోజనకరంగా భావిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం కూడా మధురంగా ఉంటుంది. కొంతమంది జాతకులు లాభాలు పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి కూడా శుభవార్తలు వింటారు.

తులా రాశి

ఈ రాశి వారికి సంవత్సరంలోని చివరి పౌర్ణమి రోజున చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలో మంచి డీల్ పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి. సంతాన భాగ్యం కూడా కలగవచ్చు.

సింహ రాశి

ఈ రాశి వారికి సంవత్సరంలో చివరి పౌర్ణమి రోజు అదృష్టాన్ని చేకూరుస్తుంది. కెరీర్ లో ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. సౌభాగ్యం వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం