తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Rains : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - ఆ తేదీ నుంచి మళ్లీ వర్షాలు..!
- Telangana Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ రెయిల్ అలర్ట్ ఇచ్చింది. ఈ రెండు రోజులు పొడి వాతవరణం ఉంటుందని… ఆ తర్వాత తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
- Telangana Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ రెయిల్ అలర్ట్ ఇచ్చింది. ఈ రెండు రోజులు పొడి వాతవరణం ఉంటుందని… ఆ తర్వాత తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
(1 / 7)
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది రేపటికి అల్పపీడనంగా మారి,…ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 7)
ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇవాళ మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(3 / 7)
డిసెంబర్ 17వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత తేలికపాటి వానలు పడనున్నాయి.
(4 / 7)
తెలంగాణలో డిసెంబర్ 17 నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(5 / 7)
ఏపీలో కూడా వర్షాలు కురవనున్నాయి. సోమవారం ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం కోస్తా,రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
(6 / 7)
భారీ వర్ష సూచన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి
ఇతర గ్యాలరీలు