Diwali stock picks for Samvat 2079 : హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ దీపావళి స్టాక్​ పిక్స్​..-diwali picks for samvat 2079 hdfc securities suggests top 10 stocks to buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Diwali Stock Picks For Samvat 2079 : హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ దీపావళి స్టాక్​ పిక్స్​..

Diwali stock picks for Samvat 2079 : హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ దీపావళి స్టాక్​ పిక్స్​..

Sharath Chitturi HT Telugu
Oct 17, 2022 04:12 PM IST

Diwali stock picks for Samvat 2079 : దీపావళి స్టాక్స్​ టు బై లిస్ట్​ను హెచ్​డీఎఫ్​సీ వెల్లడించింది. ఆ వివరాలు..

Shutterstock
Shutterstock

Diwali stock picks for Samvat 2079 : సంవత్​ 2079లో స్టాక్ ​మార్కెట్​లో ఒడిదొడుకులు కొనసాగవచ్చని ప్రముఖ బ్రోకరేజ్​, రీసెర్చ్​ సంస్థ హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ అభిప్రాయపడింది. అయితే.. ప్రస్తుతం ఉన్నంత తీవ్రత ఉండకపోవచ్చని పేర్కొంది. వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ సంవత్​ 2079లో ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధివైపు అడుగులు వేస్తే.. స్టాక్​ మార్కెట్లు అప్​ట్రెండ్​లో ముందుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక సంవత్​ 2079లో భాగంగా.. దీపావళి స్టాక్​ పిక్స్​ను ప్రకటించింది హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​. వచ్చే దీపావళి వరకు కొనగోళ్లు చేయదగిన 10 స్టాక్స్​ని వెల్లడించింది.

హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ ప్రకారం..

ఆస్టర్​ డీఎం హెల్త్​కేర్​:- టైర్​ 1 నగరాల్లో విస్తరణ, ధరల పెంపుతో కంపెనీ ఏఆర్​పీఓబీ పెరుగొచ్చు. స్పెషాలిటీస్​లో మెడికల్​ వాల్యూ టూరిజానికి ఆదరణ పెరగవచ్చు. ఈ స్టాక్​ టార్గెట్​ రూ. 278.

భారత్​ డైనమిక్స్​:- కొత్త ప్రాడక్టులను తయారు చేసేందుకు తన అనుభవాలను ఉపయోగించుకోవాలని బీడీఎల్​ చూస్తోంది. ఫలితంగా సంస్థ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడొచ్చు. రెవెన్యూ బలంగా ఉంటుందని అనిపిస్తోంది. ఆర్డర్​ బుక్​ కూడా బాగానే ఉంది. ఇండీజినైజేషన్​, అంతర్గాత సామర్థ్యం పెంపు వంటిపై సంస్థ దృష్టిసారిస్తోంది. స్టాక్​ టార్గెట్​:- రూ. 1,022.

Best stocks to buy : భారత్​ ఎలక్ట్రానిక్స్​:- బీఈఎల్​ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా ఉంది. ప్రాఫిటబులిటీ, రిటర్నులు, జీరో నెట్​ డెట్​, మంచి లిక్విడిటీ.. సంస్థ సొంతం. స్టాక్​ టార్గెట్​:- రూ. 123

బిర్లా కార్పొరేషన్​:- ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీ అనేక చర్యలు చేపట్టింది. క్లింకర్​ కెపాసిటీ పెరుగుతోంది, కోల్​ ఎక్స్​ట్రాక్షన్​తో రెవెన్యూ, మార్జిన్లు పెరుగుతాయి. స్టాక్​ టార్గెట్​ రూ. 1,069

సిప్లా:- సిప్లాకు 1 ఇండియా నుంచి 45శాతం, అమెరికా నుంచి 20శాతం, దక్షిణాఫ్రికా, సబ్​ సహారా ఆఫ్రికా- గ్లోబల్​ ఆక్సెస్​ నుంచి 17శాతం, ఆర్​ఓడబ్ల్యూ నుంచి 13శాతం, ఏపీఐ సెగ్మెంట్​ నుంచి 3శాతం రెవెన్యూ లభిస్తోంది. ఇంత డైవర్సిఫైడ్​గా ఉండటం సంస్థకు కలిసివచ్చే విషయం. స్టాక్​ టార్గెట్​ రూ. 1,283.

Diwali stocks 2022 : దీపక ఫర్టిలైజర్స్​:- ఉత్పత్తుల్లో మార్పులు, ఆపరేషనల్​ మేనేజ్​మెంట్​లో వృద్ధి, డీ-బాటిల్​నెకింగ్​, గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​పాన్షన్​ సంస్థకు కలిసి వచ్చే విషయాలు. స్టాక్​ ధర రూ. 1,058.

ఐసీఐసీఐ బ్యాంక్​:- రీటైల్​, ఎస్​ఎంఈ విభాగంలో అభివృద్ధి కోసం.. సాంకేతికపై పెట్టుబడి, డిజిటల్​ ఇనీషియేటివ్స్​పై సంస్థ మరింత దృష్టి సారించింది. సబ్సిడరీలు ఈ సంస్థకు మంచి వాల్యూలు తెచ్చిపెడుతున్నాయి. స్టాక్​ టార్గెట్​ రూ. 999

Stocks to buy for Diwali 2022 : రైల్​ వికాస్​ నిగం:- కంపెనీ బ్యాలెన్స్​ షీట్​ చాలా బలంగా ఉంది. డివిడెండ్​ యీల్డ్​ 5శాతంగా ఆకర్షణీయంగా ఉంది. రానున్న ఏళ్లల్లో సంస్థ ఇంకా వృద్ధిచెందే అవకాశం ఉంది. స్టాక్​ టార్టెట్​ రూ. 42.25

సన్​ టీవీ:- సన్​ టీవీ ప్రాఫిట్​ మార్జిన్లు అత్యంత శక్తివంతంగా ఉంటున్నాయి. స్టాక్​ టార్గెట్​ రూ. 624

టీసీఐ ఎక్స్​ప్రెస్​:- ఎఫ్​వై 22-24లో సేల్స్​, ఎబిట్​డా, ఏపీఏటీ వరుసగా 18శాతం, 25శాతం, 25శాతం సీఏజీఆర్​తో వృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే మార్జిన్లు తగ్గే అవకాశం ఉంది. స్టాక్​ టార్గెట్​ రూ. 2,169.

(గమనిక:- ఇవి కేవలం నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో పెట్టుబడి పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ను సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం