CNG car vs petrol car: సీఎన్జీ కారు బెటరా?.. పెట్రోల్ కారు బెటరా?.. ఇలా తెలుసుకోండి..
CNG car vs petrol car: ఈ మధ్య కాలంలో సీఎన్జీ కార్ల (CNG car) సేల్స్ భారతదేశంలో విపరీతంగా పెరిగాయి. అయితే, పెట్రోలు కారుపైననే విశ్వాసం ఉంచే కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది.
CNG car vs petrol car: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు కూడా సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను బాగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఇంకా ఎక్కువగానే ఉంటున్నాయి. దాంతో, కొనుగోలుదారులు సీఎన్జీ కార్ల వంటి ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్తున్నారు.
ధర తక్కువ
పెట్రోల్ లేదా డీజిల్ కంటే సీఎన్జీ ధర తక్కువగా ఉంటుంది. అదే సమయంలో, ఇది మెరుగైన మైలేజీని కూడా ఇస్తుంది. పెట్రోలు తో కూడా నడవడం సీఎన్జీ కార్లతో ఉన్న మరో ప్రయోజనం. సీఎన్జీ అందుబాటులో లేని సమయంలో పెట్రోలుతో కూడా ఈ వాహనాలను నడపవచ్చు. ఈ సదుపాయం వల్ల వినియోగదారులు సీఎన్జీపై ఎక్కువ ఆసక్తి చూపడానికి కారణమవుతోంది.
ఏది బెటర్?
సాధారణంగా పెట్రోల్ ధర CNG కంటే చాలా ఎక్కువ. దీని ఫలితంగా పెట్రోలుతో మాత్రమే నడిచే కార్లకు నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుంది. అయితే, హైవేలపై, నగరాల్లో, పట్టణాల్లో పెట్రోలు లభిస్తుంది. ప్రయాణ సమయంలో ఇంధనం అయిపోతే ఎలా? అన్న భయం పెట్రోలు వాహనాలతో ఉండదు. పెట్రోల్-సీఎన్జీ కార్ల విషయానికి వస్తే, సీఎన్జీ ధర తక్కువ కాబట్టి, వాటి రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. సీఎన్జీతో మైలేజీ కూడా ఎక్కువగా వస్తుంది. అయితే, పెట్రోల్-CNG మోడల్ కార్లు పెట్రోల్, సీఎన్జీ పవర్‌ట్రెయిన్ మెకానిజమ్స్ రెండింటినీ కలిపి మరింత సంక్లిష్టమైన సాంకేతికతతో వస్తాయి. కాబట్టి పెట్రోల్-సీఎన్జీ మోడల్ వాహనాలకు నిర్వహణ ఖర్చు ఎక్కువ. CNG రీఫిల్లింగ్ స్టేషన్లు ఎక్కువగా లేకపోవడం మరో సమస్య.
Parametres | Petrol-only | Petrol-CNG |
Fuel price | High | Low |
Upfront cost | Low | High |
Running cost | High | Low |
Maintenance cost | Low | High |
Environment friendliness | Low | High |
Power output | High | Low |
Fuel efficiency | Low | High |
Fuel availability | High | Low |
Availability of car models | High | Low |