Portable air conditioner: ఏసీ కాస్ట్లీ.. కొనలేం అనుకుంటున్నారా? ఈ పోర్టబుల్ ఏసీలను ట్రై చేయండి..-best portable air conditioner top 4 picks to get efficient and fast cooling ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Portable Air Conditioner: ఏసీ కాస్ట్లీ.. కొనలేం అనుకుంటున్నారా? ఈ పోర్టబుల్ ఏసీలను ట్రై చేయండి..

Portable air conditioner: ఏసీ కాస్ట్లీ.. కొనలేం అనుకుంటున్నారా? ఈ పోర్టబుల్ ఏసీలను ట్రై చేయండి..

HT Telugu Desk HT Telugu
Mar 08, 2024 02:34 PM IST

Portable air conditioner: వేసవి ముంచుకొస్తుంది. ఉష్ణోగ్రతలు పెరగడం ఆల్రెడీ ప్రారంభమైంది. ఎయిర్ కండిషనర్ కొనడం తప్పని సరైంది. అయితే, ఏసీల ఖరీదును భరించలేం అనుకునేవారు.. చవకగా లభించే ఈ పోర్టబుల్ ఏసీలను కొనుగోలు చేయవచ్చు. ఏసీలు అందించే చల్లదనాన్నే ఇవి కూడా అందిస్తాయి.

పోర్టబుల్ ఏసీ
పోర్టబుల్ ఏసీ

Portable AC: స్ప్లిట్ మరియు విండో ఎయిర్ కండిషనర్లు (ఎసి) గురించి మనందరికీ తెలుసు, కానీ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ల గురించి మనలో ఎంత మందికి తెలుసు? పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ ను కొనుగోలు చేయడం ఈ వేసవిలో చేయవలసిన తెలివైన నిర్ణయం అవుతుంది. భారత్ లో చాలా ఇళ్లలో విండో లేదా స్ప్లిట్ ఏసీని ఇన్ స్టాల్ చేసుకునే సదుపాయం ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పోర్టబుల్ ఏసీని ఎంచుకోవడం మంచిది.

పోర్టబుల్ ఏసీలతో అనేక ప్రయోజనాల

పోర్టబుల్ ఏసీ (Portable AC) లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటికి ఇన్ స్టలేషన్ సమస్య ఉండదు. వీటికి ఉండే చక్రాలతో వీటిని ఏ గదిలో కావాలంటే ఆ గదికి మార్చుకోవచ్చు. చిన్న, చిన్న ఇళ్లు, గదుల్లో నివసించేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సాధారణ ఏసీలతో పోలిస్తే వీటి ధర తక్కువ. అంతేకాదు, వీటి విద్యుత్ వాడకం కూడా తక్కువే. దాంతో, మీ నెలవారీ విద్యుత్ చార్జీలు కూడా తక్కువే వస్తాయి.

ఫీచర్స్..

లేటెస్ట్ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు (Portable AC) అనేక అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో వస్తున్నాయి. వాటిలో ప్రోగ్రామబుల్ టైమర్లు, రిమోట్ కంట్రోల్స్, స్వింగ్, అడ్జస్టబుల్ ఫ్యాన్ స్పీడ్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ల వివరాలు మీ కోసం..

హూమీ యూనివర్సల్ విండో సీల్

హూమీ 560 సెం.మీ యూనివర్సల్ విండో సీల్ (HOOMEE Universal Window Seal) పోర్టబుల్ ఏసీ ఎయిర్ ఎక్స్ఛేంజ్ గార్డులు వేడి గాలి గదిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. 560 సెం.మీ పొడవుతో ఉండే ఈ ఏ రకమైన గది పరిమాణాలకైనా సూట్ అవుతుంది.

రివేరా పర్సనల్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్

ఈ రివేరా పర్సనల్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ (Riveira Personal Portable Air Conditioner) పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ లో మినీ ఎవాపరేటివ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. దీన్ని డెస్క్ లు, నైట్ స్టాండ్ లు లేదా కాఫీ టేబుల్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులోని 7 రంగుల ఎల్ఈడీ లైట్ తో ఏ వాతావరణానికైనా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇందులో టైమర్ ఫీచర్ కూడా ఉంది. అలాగే, 3 విండ్ స్పీడ్, 3 స్ప్రే మోడ్ లు ఉంటాయి.

ఇవాపోలార్ ఇవా చిల్ పోర్టబుల్ ఏసీ

ఇవాపోలార్ ఇవా చిల్ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ (Evapolar evaCHILL Portable Air Conditioner) లను ఈవీ-500 అని కూడా పిలుస్తారు. ఈ మినీ ఎసి యూనిట్ సమర్థవంతమైన ఎవాపరేటివ్ కూలింగ్ టెక్నాలజీని అందిస్తుంది. ఇది పడకగదులు, కార్యాలయాలు, కార్లు మరియు క్యాంపింగ్ ట్రిప్పులలో కూడా ఉపయోగపడుతుంది. దీని కాంపాక్ట్ డిజైన్, అర్బన్ గ్రే కలర్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ పోర్టబిలిటీ, హ్యూమిడిఫైయర్ ఫ్యాన్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

బజాజ్ స్నోవెంట్ టవర్

బజాజ్ స్నోవెంట్ టవర్ (Bajaj Snowvent Tower) ఏసీ త్రీ-స్పీడ్ కంట్రోల్ బ్లోయర్ ఉంటుంది. దీనిలో ఎయిర్ ఫ్లోను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఏసీలో హై ఎయిర్ త్రో, స్వింగ్ కంట్రోల్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ పోర్టబుల్ ఏసీకి బజాజ్ 1 సంవత్సరం వారంటీ ఇస్తుంది.

Whats_app_banner