Apple MacBook Pro: మ్యాక్ బుక్ ప్రో లో మరింత పవర్ ఫుల్ వర్షన్ ను లాంచ్ చేసిన ఆపిల్-apple launches new more powerful versions of macbook pro ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Macbook Pro: మ్యాక్ బుక్ ప్రో లో మరింత పవర్ ఫుల్ వర్షన్ ను లాంచ్ చేసిన ఆపిల్

Apple MacBook Pro: మ్యాక్ బుక్ ప్రో లో మరింత పవర్ ఫుల్ వర్షన్ ను లాంచ్ చేసిన ఆపిల్

Sudarshan V HT Telugu
Nov 02, 2024 05:27 PM IST

Apple MacBook Pro: క్రియేటివ్ ప్రొఫెషనల్స్ ను లక్ష్యంగా చేసుకుని ఎం4 ప్రాసెసర్లతో కూడిన కొత్త మ్యాక్ బుక్ ప్రో మోడళ్లను ఆపిల్ లేటెస్ట్ గా లాంచ్ చేసింది. దీని ధర 1,599 డాలర్ల నుంచి ప్రారంభమౌతోంది. నవంబర్ 8 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. కస్టమర్లు ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు.

మ్యాక్ బుక్ ప్రో లో పవర్ ఫుల్ వర్షన్ ను లాంచ్ చేసిన ఆపిల్
మ్యాక్ బుక్ ప్రో లో పవర్ ఫుల్ వర్షన్ ను లాంచ్ చేసిన ఆపిల్ (HT_PRINT)

Apple MacBook Pro: క్రియేటివ్ ప్రొఫెషనల్స్ ను లక్ష్యంగా చేసుకుని ఫోటో, వీడియో ఎడిటింగ్ వంటి పనుల కోసం మరింత శక్తివంతమైన ప్రాసెసర్లను కలిగి ఉన్న కొత్త మ్యాక్ బుక్ ప్రో మోడళ్లను ఆపిల్ ఆవిష్కరించింది. మ్యాక్ బుక్ ప్రో ల్యాప్ టాప్ ల కొత్త శ్రేణి 14-అంగుళాల వేరియంట్ ధర $ 1,599 నుండి ప్రారంభమవుతుంది. హై-ఎండ్ వెర్షన్ల లో మరింత శక్తివంతమైన ఎం 4 ప్రో, ఎం 4 మ్యాక్స్ ప్రాసెసర్లు ఉంటాయి. బేస్ స్పెసిఫికేషన్ ఎం4 చిప్ కలిగిన 16 అంగుళాల స్క్రీన్ వేరియంట్ ప్రారంభ ధర 2,499 డాలర్లుగా ఉంది.

ఏఐ టూల్స్ తో..

ప్రస్తుతం మొబైల్, ల్యాప్ టాప్ వినియోగదారులు తాము వాడే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ ఉండాలని కోరుకుంటున్నారు. తమ రిక్వైర్మెంట్లను కృత్రిమ మేధ సాధనాలు ఈజీగా ప్రాసెస్ చేయగలవని వారు భావిస్తున్నారు. వినియోగదారులు మరింత శక్తివంతమైన చిప్ లు ఉన్న పర్సనల్ కంప్యూటర్లకు అప్ గ్రేడ్ కావాలని చూస్తున్నారు.

ఆపిల్ డివైజెస్ లో..

ఆపిల్ డివైజ్, సిరి ల భాషను యు.ఎస్ ఇంగ్లీష్ కు సెట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో తమ డివైజెస్ లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ను యాక్సెస్ చేయవచ్చు. ఎం 1 చిప్ లతో లేదా ఆ పై చిప్ సెట్ లు ఉన్న మ్యాక్ లకు బుధవారం నుండి ఉచిత సాఫ్ట్ వేర్ అప్ డేట్ అందుబాటులో ఉంటుంది. మ్యాక్ ఓఎస్ సెకోయా 15.1తో బీటాలో అందుబాటులో ఉన్న ప్రారంభ టూల్స్, రాబోయే నెలల్లో విస్తృతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

ప్రి ఆర్డర్ చేసుకోవచ్చు..

వినియోగదారులు ఇప్పుడు కొత్త మ్యాక్ బుక్ ప్రో ను ప్రీ-ఆర్డర్ చేయవచ్చు, డెలివరీలు నవంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా నవంబర్ 8 నుంచి అందుబాటులో ఉంటాయి. ఆపిల్ ఈ ఏడాది ప్రారంభంలో రెండు కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ లను విడుదల చేసింది. వాటిలో ఇప్పుడు ఎం 3 ప్రాసెసర్ ఉన్న 13 అంగుళాల స్క్రీన్ వేరియంట్ ధర $ 1,099 నుండి ప్రారంభమవుతుంది.

ఏఐ టూల్స్ ఉన్న ల్యాప్ టాప్ లకు డిమాండ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ఆధారిత కంప్యూటర్ల వాడకంతో పీసీ మార్కెట్ 2025లో మరింత పుంజుకోనుంది. కాలిఫోర్నియాకు చెందిన క్యూపర్టినో కంపెనీ ఎం4 చిప్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో రంగురంగుల ఐమ్యాక్ డెస్క్ టాప్ కంప్యూటర్లను ఆవిష్కరించిన కొద్ది రోజుల తర్వాత ఆపిల్ (apple) కొత్త లాంచ్ లు వచ్చాయి.

Whats_app_banner