Amazon Prime Day 2023: ప్రతీ సెకన్ కు ఐదు స్మార్ట్ ఫోన్స్ చొప్పున అమ్మిన ఆమెజాన్; ప్రైమ్ డే సేల్ లో రికార్డ్-amazon prime day 2023 5 smartphones sold every second during the sale revealed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Prime Day 2023: ప్రతీ సెకన్ కు ఐదు స్మార్ట్ ఫోన్స్ చొప్పున అమ్మిన ఆమెజాన్; ప్రైమ్ డే సేల్ లో రికార్డ్

Amazon Prime Day 2023: ప్రతీ సెకన్ కు ఐదు స్మార్ట్ ఫోన్స్ చొప్పున అమ్మిన ఆమెజాన్; ప్రైమ్ డే సేల్ లో రికార్డ్

HT Telugu Desk HT Telugu
Jul 22, 2023 04:23 PM IST

Amazon Prime Day 2023: జులై 15, జులై 16 తేదీల్లో జరిగిన ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఆ సేల్ సమయంలో కస్టమర్లు ప్రతీ సెకన్ కు సగటున ఐదు స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేశారని ఆమెజాన్ వెల్లడించింది. గత సంవత్సరం కన్నా 14% అధికంగా కస్టమర్లు ఈ ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్నారట.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Amazon)

Amazon Prime Day 2023: జులై 15, జులై 16 తేదీల్లో జరిగిన ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఆ సేల్ సమయంలో కస్టమర్లు ప్రతీ సెకన్ కు సగటున ఐదు స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేశారని ఆమెజాన్ వెల్లడించింది. గత సంవత్సరం కన్నా 14% అధికంగా కస్టమర్లు ఈ ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్నారట.

14% అధికం

ప్రతీ సంవత్సరం ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ ను ప్రకటిస్తుంటుంది. 2023 జులై 15, 16 తేదీల్లో ప్రైమ్ డే సేల్ ఏడవ ఎడిషన్ ను నిర్వహించింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, హౌజ్ హోల్డ్ ఐటమ్స్.. తదితర ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ లను ఆమెజాన్ ప్రకటించింది. 2022 ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్న కస్టమర్ల సంఖ్య కన్నా 2023 ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్న కస్టమర్ల సంఖ్య 14% అధికమని ఆమెజాన్ ప్రకటించింది.

ప్రతీ సెకన్ కు ఐదు స్మార్ట్ ఫోన్స్

ప్రైమ్ డే సేల్ సమయంలో కస్టమర్లు ప్రతీ సెకన్ కు సగటున ఐదు స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేశారని ఆమెజాన్ వెల్లడించింది. అందులో కూడా, 70% సేల్స్ చిన్న నగరాలు, పట్టణాల (Tier 2 & 3 cities) నుంచే జరిగాయని పేర్కొంది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్, వన్ ప్లస్ నార్డ్ 3 5జీ, సామ్సంగ్ గెలాక్సీ ఎం 34, మోటొరోలా రేజర్ 40 సిరీస్, రియల్ మి నార్జొ 60 సిరీస్ వంటి కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్, భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా అమ్ముడుపోయాయి.

సామ్సంగ్ గెలాక్సీ ఎం 34 వే ఎక్కువ సేల్స్

ప్రైమ్ డే సేల్ లో సామ్సంగ్ గెలాక్సీ ఎం 34 5జీ స్మార్ట్ ఫోన్ అత్యధికంగా అమ్ముడుపోయింది. ఈ సేల్ లో పాల్గొన్న ప్రైమ్ కస్టమర్లలో 45% మంది ఆమెజాన్ పే తో చెల్లింపులు జరిపారు. వారిలో కూడా 82% చిన్న నగరాలు, పట్టణాలకు (Tier 2 & 3 cities) చెందిన వారే ఉన్నారు. ప్రతీ నలుగురు కస్టమర్లలో ఒకరు ఆమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను వినియోగించారు. 2022 ప్రైమ్ డే సేల్స్ తో పోలిస్తే 2023 ప్రైమ్ డే సేల్స్ లో 56% అధిక బిజినెస్ జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ లో రెండింతలు, ఆఫీస్ ఫర్నిచర్ లో 1.7 రెట్లు, కిచెన్ ప్రొడక్ట్స్ లో 1.4 రెట్లు సేల్స్ జరిగాయి.

Whats_app_banner