Bullet 350 : 2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఇదే!
2023 Royal Enfield Bullet 350 : రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లేటెస్ట్ వర్షెన్ లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
2023 Royal Enfield Bullet 350 : 2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 కోసం బైక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ చెప్పింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ ఏడాది ఆగస్టు 30న ఈ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది.
ఈ బైక్.. చాలా ప్రత్యేకం!
రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలో బుల్లెట్‌కు ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంటుంది. 1931లో తొలిసారిగా ఇది మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి అనేక మోడల్స్, కస్టమర్లను ఆకర్షించాయి.
ఇక త్వరలో లాంచ్ కానున్న 2023 బుల్లెట్ 350 డిజైన్, పాత మోడల్‌నే పోలి ఉండొచ్చు. కానీ.. స్వల్ప మాల్పులు జరిగే ఆస్కారం ఉంది. ఇందులో టియర్‌డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్, మెటాలిక్ బ్యాడ్జ్, సర్క్యులర్ హెడ్‌ల్యాంప్, సిగ్నేచర్ టైగర్ ఐ పైలట్ ల్యాంప్స్, వైడ్ హ్యాండిల్‌బార్, స్టెప్డ్ ఆప్ సీట్, ఇంటిగ్రేటెడ్ ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్ వంటివి వస్తున్నాయి. ఇందులో వైర్ స్పోక్ వీల్స్ ఉంటాయి.
ఇక ఈ బైక్‌లో 349సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్, జే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. మరో బెస్ట్ సెల్లింగ్ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లోనూ ఇదే ఇంజిన్ ఉంటుంది. ఇది 20 హెచ్‌పీ పవర్‌ను, 28 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ దీని సొంతం. సేఫ్టీ కోసం ఫ్రెంట్- రేర్‌లో డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ కూడా లభిస్తోంది.
ఇదీ చూడండి:- Harley Davidson X440 vs Royal Enfield Himalayan : ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?
ఈ మోడల్ ధర ఎంత ఉంటుంది..?
2023 Royal Enfield Bullet 350 launch : 2023 బుల్లెట్ 350 ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. లాంచ్ టైమ్‌కి ఓ క్లారిటీ వస్తుంది. అయితే.. 2022 మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 1.6లక్షలుగా ఉంది. కొత్త మోడల్ దీని కన్నా ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు!
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440కి ధీటుగా..!
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైక్స్.. గత కొన్ని రోజులుగా ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి. వీటితో రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్‌కు ముప్పు పొంచి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు, సరికొత్త బైక్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్ పేరు 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440'. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం