December 05 Telugu News Updates : బీఎల్ సంతోష్‌, జగ్గుస్వామి 41 ఏ నోటీసులపై హైకోర్టు స్టే-andhra pradesh and telangana live news updates 05 december 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  December 05 Telugu News Updates : బీఎల్ సంతోష్‌, జగ్గుస్వామి 41 ఏ నోటీసులపై హైకోర్టు స్టే

తెలంగాణ హైకోర్టు(HT_PRINT)

December 05 Telugu News Updates : బీఎల్ సంతోష్‌, జగ్గుస్వామి 41 ఏ నోటీసులపై హైకోర్టు స్టే

05:59 PM ISTDec 05, 2022 05:00 PM B.S.Chandra
  • Share on Facebook
05:59 PM IST

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్‌ వచ్చిన ద్రౌపది ముర్ము ఆదివారం విజయవాడ, విశాఖపట్నంలలో పర్యటించారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత  పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్ధినులతో రాష్ట్రపతి భేటీ అవుతారు. 

Mon, 05 Dec 202205:59 PM IST

10వ తేదీన క్యాబినెట్ భేటీ

ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది.

Mon, 05 Dec 202211:56 AM IST

టీటీడీ విద్యా సంస్థల్లో స్పాట్ అడ్మిషన్లు

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల, శ్రీ గోవింద రాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య (ఓరియంటల్ ) కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి డిసెంబరు 7వ తేదీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలి. స్పాట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వర్తించవు.

Mon, 05 Dec 202211:28 AM IST

బీఎల్ సంతోష్‌, జగ్గుస్వామి 41 ఏ నోటీసులపై హైకోర్టు స్టే

ఎమ్మెల్యేల ఎర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు హైకోర్టులో ఊరట లభించింది. సిట్ జారీ చేసిన 41 ఏ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. 13వ తేదీవరకు స్టే విధించగా.. తదుపరి నోటీసుల వరకూ ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించింది.

Mon, 05 Dec 202209:33 AM IST

జీఓ 118 విడుదల

మన నగరం కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ హామీ మేరకు జీఓ 118 విడుదల అయింది. జీవో 118 కి సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేసింది సీసీఎల్ఏ. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని 44 కాలనీలలో ఉన్న ఓపెన్ ప్లాట్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి గజానికి 250 రూపాయల చొప్పున చెల్లించాలి. ఇందుకోసం ఏదైనా మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవాలి. ఇందుకోసం కావలసిన డాక్యుమెంట్లు. ఆధార్ కార్డ్, నివాసానికి సంబంధించిన ప్రూఫ్( వాటర్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు, ప్రాపర్టీ టాక్స్ బిల్లు, స్థలానికి సంబంధించిన పత్రాల)తో పాటు స్థలం ఫోటో సమర్పించాలి. అప్లికేషన్ కింద 500 రూపాయలు చెల్లించాలి. ఈ అప్లికేషన్లకు డిసెంబర్ 20 చివరి తేదీగా ఉంది.

Mon, 05 Dec 202207:03 AM IST

స్కిల్ డెవలప్‌మెంట్‌లో రాజకీయ కుట్ర ఉంది

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయన్నారు. 

Mon, 05 Dec 202206:20 AM IST

వీరంకిలాకులో రైతుల ఆందోళన

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం వీరంకిలాకులో రైతుల ఆందోళనకు దిగారు.  ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆందోళన చేస్తున్నారు.  సంచుల్లోకి ధాన్యం నింపినా తీసుకెళ్లట్లేదని రైతుల ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.  రోజుల తరబడి రోడ్లపైనే ధాన్యం ఉంటోందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఆర్బీకే అధికారులను అడిగినా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.  ధాన్యం నిల్వ ఉండటంతో రంగు మారిపోతుందని వాపోతున్నారు. 

Mon, 05 Dec 202206:18 AM IST

తాశీల్దార్ కార్యాలయానికి తాళం

కర్నూలు జిల్లా దేవనకొండ తహశీల్దార్ కార్యాలయానికి తాళం  వేశారు. తాశీల్దార్ కార్యాలయానికి తాళం వేసి అఖిలపక్ష నాయకుల ఆందోళన నిర్వహిస్తున్నారు. - హంద్రీనీవాకు నీరు మార్చి వరకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. - మంత్రి జయరాం హామీ మేరకు మార్చి చివరి వరకు నీటి విడుదల చేయాలని  అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. 

Mon, 05 Dec 202206:09 AM IST

బీసీ నేతలపై దాడులు సిగ్గుచేటు…లోకేష్‌

సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహిస్తుంటే, ఇటు పుంగనూరులో ముఖ్యమంత్రి తరువాత నెంబర్ 2 స్థానంలో వున్న మంత్రి పెద్దిరెడ్డి  బీసీ నేతలని అంతమొదించే కుతంత్రాలు చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. బీసీ అయిన పుంగనూరు జనసేన నాయకుడు రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటిచారు.  

Mon, 05 Dec 202204:18 AM IST

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

 సీఎం జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.  జీ-20పై ప్రధాని నిర్వహించే అఖిలపక్ష భేటీలో పాల్గొననున్నారు.  మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం,  మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‍లో జీ-20పై నిర్వహించే సదస్సులో పాల్గొంటారు.  రాత్రి 7.55కు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. 

Mon, 05 Dec 202204:16 AM IST

ఏలూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

ఏలూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. - వైసీపీ కార్యకర్తల దాడిలో చింతమనేని ప్రభాకర్ అనుచరుడు శివబాబుకు గాయాలు అయ్యాయి.   ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  టీడీపీ వాళ్లే తమపై దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.   ఏలూరు ఆస్పత్రిలో వైసీపీ కార్యకర్తలు చికిత్స పొందుతున్నారు. 

Mon, 05 Dec 202204:18 AM IST

బాపట్లలో ఘోర ప్రమాదం

బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా ఏస్ ఆటో బోల్తా పడి నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో 16మందికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు.  మరణించిన వారు కృష్ణా జిల్లా,పెడన నియోజకవర్గం,నిలపూడి గ్రామం కు చెదిరిన వారిగా గుర్తించారు.  శబరిమల నుంచి ట్రైన్లలో తెనాలి స్టేషన్ లో దిగి వ్యాన్ లో బయలుదేరగా మంచు కారణంగా  ప్రమాదం జరిగింది.  ఘటన సమయంలో  మొత్తం వ్యాన్ లో 23 మంది ప్రయాణిస్తున్నారు.  ఘటన స్థలం లో ముగ్గురు మృతి చెందారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరు మృతి చెందారు.