ఎత్తైన కొండల నుంచి పరవళ్లు తొక్కుతున్న బొగతా జలపాతం సొగసులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జలపాతం అందాలను తిలకిస్తూ సెల్ ఫోన్ లో బొగతా ఫోటోలు, వీడియోలను చిత్రీకరించి ఆనందాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా యువతి యువకులు ఈతకొడుతూ సరదాగా ఆడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగతా జలపాతం అందాలను తిలకించేందుకు తెలంగాణ నుంచే కాక ఆంధ్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి వస్తున్నారు.