Pawan Kalyan: తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ-pawan kalyan said that tdp and janasena party will contest together in the next election ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan Kalyan: తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ

Pawan Kalyan: తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ

Published Sep 14, 2023 02:56 PM IST Muvva Krishnama Naidu
Published Sep 14, 2023 02:56 PM IST

  • ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్.. మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను తెలుగుదేశం, జనసేన కలిసి ఎదుర్కొంటుందన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిపై తప్పుడు కేసులా అని పవన్ ప్రశ్నించారు. రూ.317 కోట్లు స్కామ్ అని చెబుతున్నారు.. జగన్ ఆర్థిక నేరస్థుడని అన్నారు. సైబరాబాద్ నిర్మించిన, హైటెక్ సిటీ సృష్టించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

More