Amarnath cloudburst | అమర్‌నాథ్ యాత్ర మార్గంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షంతో యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా పక్కనున్న పర్వతాల పై భాగం నుంచి వరద నీరు పోటెత్తింది. ఈ వరదలో చిక్కుకుపోయి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. వర్షం వల్ల అక్కడి కమ్యూనిటీ కిచెన్, తాత్కాలిక టెంట్స్ ధ్వంసమయ్యాయి. సహాయ చర్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. అమర్‌నాథ్ గుహ దగ్గరలో వరద బీభత్స దృశ్యాలు..