YS Vijayamma on Jagan | జగన్ హత్యా ప్రయత్నం చేశారా.. వైఎస్ విజయమ్మ క్లారిటీ
- తనపై వైఎస్ జగన్ హత్యా ప్రయత్నం చేశారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని సూచన చేశారు. కుటుంబాల్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చని అన్నారు. అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు. ఇటీవలి రెండు లేఖలు తాను రాసినవేనని స్పష్టం చేశారు. నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం తమకి లేదన్నారు. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు వైఎస్ విజయమ్మ.