మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న ఐఏఎస్ అధికారి బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కేందుకు ప్రయత్నించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఐఏఎస్ అధికారులు స్థాయికి తగినట్టు ప్రవర్తించాలని, ఆలిండియా సర్వీస్ అధికారులు హుందాగా వ్యవహరించాలని సీఎస్ మెమో జారీ చేశారు.