సివిల్స్ ఫలితాల్లో వరంగల్ కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని ఉత్తమ ప్రతిభ చాటింది. ఆలిండియా 11వ ర్యాంక్ సాధించి, తెలుగు రాష్ట్రాల టాపర్ గా నిలిచింది. ఎలాంటి కోచింగ్ లేకుండా, సొంతంగా ప్రిపేర్ అయిన సాయి శివాని.. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.