తెలంగాణ.. ఎన్నో ఉద్యమాలకు తొలిపొద్దు. ఈ గడ్డ ఎందరో పోరాట యోధులకు జన్మనిచ్చింది. వారిలో కొందరు రాజ్యం కుట్రలకు బలయ్యారు. అలా బలైన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బెల్లి లలిత గురించి. తన పాటలతో ఉద్యమానికి ఊపిరి పోస్తున్న లలితను.. అత్యంత దారుణంగా చంపేశారు. ఆమె చనిపోయి 26 ఏళ్లైయినా.. పాట బతికే ఉంది.