TSRTC : టీఎస్ఆర్టీసీ రాఖీ పండగ ఆఫర్ ఏంటంటే?-tsrtc new offer for raksha bandhan 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc : టీఎస్ఆర్టీసీ రాఖీ పండగ ఆఫర్ ఏంటంటే?

TSRTC : టీఎస్ఆర్టీసీ రాఖీ పండగ ఆఫర్ ఏంటంటే?

HT Telugu Desk HT Telugu
Jul 31, 2022 04:05 PM IST

పండగలకు ఏదో ఒక ఆఫర్ తో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది టీఎస్ఆర్టీసీ. తాజాగా రాఖీ పండగ కోసం మరో ఆఫర్ ను ప్రకటించింది.

<p>టీఎస్ఆర్టీసీ రాఖీ పండగ ఆఫర్</p>
టీఎస్ఆర్టీసీ రాఖీ పండగ ఆఫర్

మహిళల కోసం టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాఖీ పండగ వచ్చేస్తుంది. అన్నదమ్ములకు రాఖీ కట్టాలని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత వెళ్లాలన్నా.. కుదరకపోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆడపడుచులు వెళ్లి తమ అన్నదమ్ములకు స్వయంగా రాఖీ కట్టలేకపోవచ్చు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని.. టీఎస్ఆర్టీసీ ఓ ఆఫర్ ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించే అవకాశం కల్పిస్తుంది.

టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసులను హైదరాబాద్, సికింద్రాబాద్ లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్

ఇకపై మీరు ఎక్కాల్సిన బస్సు.. ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉంది అనేది ఈజీగా తెలిసిపోనుంది. బస్సుల రాకపోకల సమయాన్ని ప్రయాణికులు ఈజీగా గుర్తించడం కోసం టీఎస్ఆర్టీసీ సరికొత్తగా ట్రాకింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీనికోసం.. టీఎస్‌ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’(TSRTC Bus Tracking) పేరిట ఆర్టీసీ అధికారులు ప్రత్యేక యాప్‌ను తయారు చేయించారు. ఈ యాప్‌ని ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. దీని ద్వారా బస్సులు స్టాప్లకు చేరుకునే సమయాన్ని తెలుసుకోవచ్చు.

TSRTC బస్సుల ట్రాకింగ్ కోసం "TSRTC బస్ ట్రాకింగ్" పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. 140 బస్సుల్లో పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా కంటోన్‌మెంట్‌, మియాపూర్‌-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్‌ బస్సులను రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్‌కు వివిధ రూట్లలో, 100 సుదూర బస్సులను మియాపూర్‌-1, పికెట్‌కు నడుపుతున్నట్లు సజ్జనార్‌ తెలిపారు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, బెంగళూరు, విశాఖపట్నం వంటి రూట్లలో నడుస్తున్న డిపోలను ప్రస్తుతం ట్రాక్ చేయనున్నారు.

రెండు నెలల్లో హైదరాబాద్ తోపాటుగా.. జిల్లాల్లోని అన్ని రిజర్వేషన్ సర్వీసులు, ప్రత్యేక సర్వీసులకు బస్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెడతారు. TSRTC బస్ ట్రాకింగ్ యాప్‌ను TSRTC అధికారిక వెబ్‌సైట్ www.tsrtc.telangana.gov .inలో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణలోని 96 డిపోల పరిధిలోని ఎంపిక చేసిన 4,170 బస్సులను ఈ యాప్‌తో దశలవారీగా అనుసంధానించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా 140 బస్సుల్లో ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనా చెప్పారు. హైదరాబాద్‌లో పుష్పక్, మెట్రో లగ్జరీ, డీలక్స్, మెట్రో ఎక్స్ ప్రెస్ల వివరాలు యాప్ లో ఉంటాయి.

Whats_app_banner