Supreme Court | అన్ని లక్షల రేషన్ కార్డులు ఎలా రద్దు చేస్తారు? ప్రభుత్వంపై సుప్రీం సీరియస్-supreme court serious comments on telangana govt over ration cards issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Supreme Court | అన్ని లక్షల రేషన్ కార్డులు ఎలా రద్దు చేస్తారు? ప్రభుత్వంపై సుప్రీం సీరియస్

Supreme Court | అన్ని లక్షల రేషన్ కార్డులు ఎలా రద్దు చేస్తారు? ప్రభుత్వంపై సుప్రీం సీరియస్

HT Telugu Desk HT Telugu
Apr 27, 2022 08:16 PM IST

న్యూఢిల్లీ: తెలంగాణలో అధిక సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు చేయడంపై సుప్రీం కోర్టు మండిపడింది. అన్ని రేషన్ కార్డులు ఎలా తీసేస్తారని ప్రశ్నించింది.

<p>సుప్రీం కోర్టు</p>
సుప్రీం కోర్టు (HT_PRINT)

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 19 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అన్ని లక్షల రేషన్ కార్డులు ఎలా రద్దు చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సరైన పరిశీలన లేకుండా.. 19 లక్షల కార్డులు రద్దు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

yearly horoscope entry point

2016లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డుల రద్దుకు ఎలాంటి ప్రమాణాలు ఆచరించారో అఫిడవిట్‌ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో పరిశీలించారా అని ప్రశ్నించింది. కేవలం.. కంప్యూటర్‌లోని వివరాలను ఆధారంగా చేసుకుని.. రేషన్ కార్డులను ఎలా రద్దు చేస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం