TS Toddy Tappers Corporation : కార్పొరేషన్ ఛైర్మన్ గా పల్లె రవి కుమార్ నియామకం-journalist leader palle ravi kumar appointed as toddy toppers corporation chairman of telangan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Toddy Tappers Corporation : కార్పొరేషన్ ఛైర్మన్ గా పల్లె రవి కుమార్ నియామకం

TS Toddy Tappers Corporation : కార్పొరేషన్ ఛైర్మన్ గా పల్లె రవి కుమార్ నియామకం

HT Telugu Desk HT Telugu
May 04, 2023 07:12 PM IST

Telangana Toddy Tappers Cooperative Finance Corporation: రాష్ట్ర గీతా కార్మికుల కో- ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పల్లె రవి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం కేసీఆర్ తో పల్లె రవి(ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్ తో పల్లె రవి(ఫైల్ ఫొటో)

Toddy Toppers Corporation Chairman of Telangana: జర్నలిస్ట్ నాయకుడు, మునుగోడు నియోజకవర్గానికి చెందిన పల్లె రవి కుమార్ గౌడ్ కు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. రాష్ట్ర గీతా కార్మికుల కో- ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఆదేశాలు ఇచ్చారు.

కార్పొరేషన్ ఛైర్మన్ గా పల్లె రవి... సీఎస్ ఉత్తర్వులు
కార్పొరేషన్ ఛైర్మన్ గా పల్లె రవి... సీఎస్ ఉత్తర్వులు

సీనియర్ జర్నలిస్ట్ గా పేరున్న పల్లె రవి కుమార్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికవేళ టికెట్ వస్తుందని భావించారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం పాల్వాయి స్రవంతిని ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే ఆయనతో చర్చలు జరిపిన బీఆర్ఎస్ నేతలు... పార్టీలోకి రప్పించారు. మునుగోడు ఉపఎన్నికలో పార్టీ తరపున బరిలో ఉన్న కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేసేలా చేశారు. ఇదే సమయంలో ఆయనకు ప్రభుత్వ పెద్దల హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. ప్రస్తుతం పల్లె రవి సతీమణి.. కల్యాణి చండూరు మండల ఎంపీపీగా ఉన్నారు.

చిత్తుశుద్ధితో నిర్వర్తిస్తాను - పల్లె రవి కుమార్ గౌడ్,

ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి తో నిర్వర్తిస్తానని కార్పొరేషన్ ఛైర్మన్ గా ఎంపికైన పల్లె రవి కుమార్ గౌడ్ చెప్పారు. తన నియామకానికి సహకరించిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Whats_app_banner