Speaker Pocharam : చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి-assembly speaker pocharam srinivas reddy on chandrababu arrest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Speaker Pocharam : చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Speaker Pocharam : చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 22, 2023 09:47 PM IST

Speaker Pocharam Srinivas Reddy: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావటంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

స్పీకర్ పోాచారం శ్రీనివాస్ రెడ్డి
స్పీకర్ పోాచారం శ్రీనివాస్ రెడ్డి (Twitter)

Assembly Speaker Pocharam Srinivas Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామం తెలుగు రాష్ట్రాల్లో సంచలన పరిణామంగా మారింది. అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తుండగా… పలు పార్టీల నేతలు కూడా ఖండిస్తున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా… చంద్రబాబు అరెస్ట్ అంశంపై స్పందించారు.

yearly horoscope entry point

ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచిది కాదన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు… కారణం లేకుండా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.

బీర్కూరు మండలం సాంబాపూర్, బైరపూర్ గ్రామాలలో శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు స్పీకర్ పోచారం. బైరపూర్ గ్రామంలో నిర్మించిన 42 డబుల్ బెడ్ రూం ఇళ్ళను మరియు రూ. 25 లక్షలతో నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలలో స్పీకర్ పోచారం మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి స్వంత ఇళ్ళు ఉండాలన్నది తన ఆశయమని చెప్పారు. పేదవారు ఏ పార్టీ అయినా డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేశానని… అంతేకానీ దొంగల పాలు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యధికంగా 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. ఇంకా ఎవరైనా ఇల్లు లేని వారు స్వంత స్థలం ఉండి, స్వంతంగా ఇళ్ళు కట్టుకుంటే గృహలక్ష్మి పథకం కింద ఇంటిని మంజూరు చేస్తానని చెప్పారు. దేశంలో కేసీఆర్ లా 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని… కానీ ఇక్కడి మాదిరిగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

అవినీతికి పాల్పడిన డబ్బులతో ఎన్నికలలో ఓట్లు కొనడానికి నాయకులు వస్తారని…అలాంటి నాయకులను గట్టిగా నిలదీయాలని ప్రజలను కోరారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళు నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్నాయని… భవిష్యత్తులో సాగునీటికి డోకా ఉండదన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అన్ని పనులను మంజూరు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.

Whats_app_banner