January 30 Telugu News Updates : గవర్నర్ వ్యవహారంపై లంచ్ మోషన్ దాఖలు….
- బడ్జెట్ సమావేశాలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం నుంచి ప్రతిపాదనలకు అమోదం లభించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 21నే బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపినా గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు బడ్జెట్‌లో గవర్నర్ ప్రసంగం ఉంటుందో లేదో తెలియ చేయాలని గవర్నర్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
Mon, 30 Jan 202307:42 AM IST
వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‍కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి కొత్తకాదని, మేం సత్యవంతులమని చెప్పట్లేదని, ఇప్పటికన్నా గత ప్రభుత్వంలోనే అవినీతి ఎక్కువ జరిగిందని ఆరోపించారు. బీద రవిచంద్ర రూ.400 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని, అక్కడక్కడా పురపాలక అధికారులపై విమర్శలు వస్తున్నాయని, ఇళ్ల నిర్మాణాలు, ప్లాన్లకు అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకు రావాలని వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‍కుమార్ రెడ్డి సూచించారు.
Mon, 30 Jan 202307:41 AM IST
నేడు, రేపు ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన
నేడు, రేపు ఢిల్లీలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి ఢిల్లీకి పయనమవుతారు. రాత్రికి ఢిల్లీలో బస చేయనున్న సీఎం జగన్, రేపు లీలా ప్యాలెస్‍లో దౌత్యవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ తో పాటు ప్రతినిధులు హాజరు అవుతారు. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Mon, 30 Jan 202307:39 AM IST
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశాలకు సహకరించాలని అన్ని పార్టీలను కేంద్రం కోరింది. రాష్ట్రపతి ప్రసంగంతో రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఎల్లుండి పార్లమెంట్‍లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024 ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఈ ఏడాది ప్రవేశపెడుతోంది.
Mon, 30 Jan 202307:38 AM IST
సిఐడి కార్యాలయానికి చింతకాయల విజయ్
గుంటూరు సీఐడీ కార్యాలయానికి చింతకాయల విజయ్ చేరుకున్నారు. "భారతీ పే" యాప్ పోస్టు వ్యవహారంలో విజయ్‍పై సీఐడీ కేసు నమోదు చేశారు. గతేడాది సెప్టెంబర్‍లో చింతకాయల విజయ్‍పై సీఐడీ కేసు నమోదు అయ్యింది. - చింతకాయల విజయ్‍కు సీఆర్‍పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరినా, అదేరోజు వేరే కార్యక్రమాలతో విచారణకు వెళ్లలేనని విజయ్ పిటిషన్ వేవారు. సోమవారం సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. - న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని హైకోర్టు సూచించింది.
Mon, 30 Jan 202307:36 AM IST
కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వ్యవహారంపై పార్టీ హైకమాండ్ దృష్టి
కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వ్యవహారంపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కాకాణి ఆరా తీశారు. వినుకొండ పర్యటనలో జగన్ దృష్టికి కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వ్యహారాన్ని నేతలు తీసుకువెళ్లారు. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి ఆరోపించారు. తనపై ప్రభుత్వం నిఘా పెట్టిందని కోటంరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేగింది. తన చుట్టూ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ మోహరించారని కోటంరెడ్డి ఆరోపించారు.
Mon, 30 Jan 202307:34 AM IST
కమలాపురం వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
కడప జిల్లా కమలాపురం వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. గృహసారధుల ఎంపికలో వైసీపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. కౌన్సిలర్, స్టేట్ మైనార్టీ మెంబర్ మధ్య ఘర్షణ ముదిరింది. కౌన్సిలర్ నీలం నరేంద్ర ఇంటి ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది.
Mon, 30 Jan 202307:33 AM IST
నాలుగో రోజు లోకేష్ పాదయాత్ర….
యువగళంలో భాంగా లోకేశ్ పాదయాత్ర నాలుగో రోజుకు చేరింది. పలమనేరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పడిగాలకుప్పంలో నారా లోకేశ్ ను కలిసి పట్టుగూళ్ల రైతులు ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ అధికారలోకి రాగానే పట్టుగూళ్ల రైతులకు సబ్సిడీ అందిస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు.