Suvarna Bhumi Cheating: సువర్ణభూమి ఎండీతో పాటు ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు...-a cheating case has been registered against suvarnabhumi real estate md and five others ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suvarna Bhumi Cheating: సువర్ణభూమి ఎండీతో పాటు ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు...

Suvarna Bhumi Cheating: సువర్ణభూమి ఎండీతో పాటు ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు...

HT Telugu Desk HT Telugu
Jun 15, 2023 11:33 AM IST

Suvarna Bhumi Cheating: Suvarna Bhumi: సువర్ణ భూమి డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొల్లినేని శ్రీధర్‌తో పాటు సంస్థ ఉద్యోగులపై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫ్లాట్లు ఇస్తామని డబ్బు తీసుకుని మోసం చేశారంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

సువర్ణభూమి  సంస్థపై చీటింగ్ కేసులు నమోదు
సువర్ణభూమి సంస్థపై చీటింగ్ కేసులు నమోదు (HT_PRINT)

Suvarna Bhumi: సువర్ణ భూమి డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొల్లినేని శ్రీధర్‌తో పాటు సంస్థ ఉద్యోగులపై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫ్లాట్లు ఇస్తామని డబ్బు తీసుకుని మోసం చేశారంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

Suvarna Bhumi: హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఫ్లాట్లు విక్రయిస్తామంటూ పలువురి వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని ముఖం చాటేయడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు.దీంతో సువర్ణభూమి డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్‌తో పాటు సంస్థ ఉద్యోగులు, ఇతరులపై కేసులు నమోదు చేశారు.జూబ్లీహిల్స్‌ రోడ్ నంబ్ 5లో సువర్ణభూమి డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ‌్వర్యంలో వెంచర్ ప్రారంభించారు.

2017లో షాద్‌నగర్‌ సమీపంలో సువర్ణ కుటీర్‌ పేరుతో వెంచర్ వేసి ఫ్లాట్ల విక్రయాలు జరిపారు. ఈ క్రమంలో కృష్ణానగర్‌కు చెందిన కొండల్‌రావు అనే వ్యక్తితో పాటు సినీ పరిశ్రమలో పనిచేసే 21మంది రూ.6లక్షల నుంచి రూ.50లక్షల వరకు నగదు చెల్లించి ఫ్లాట్లను కొనుగోలు చేశారు.

వీరిని గంగిరెడ్డి దస్తగిరిరెడ్డి షాద్‌నగర్‌ తీసుకువెళ్లి ఫ్లాట్లను చూపించి వారితో డబ్బులు కట్టించాడు. ఆ తర్వాత సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్, జిఎం ప్రవీణ‌ కుమార్‌, ఈడీ ఎం.శ్రీనివాస తదితరులతో పలుమార్లు మాట్లాడి వాయిదాల్లో డబ్బులు చెల్లించారు.

2022లో కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పినా అలా చేయలేదు. బాధితులు ఎప్పుడు అడిగినా రేపుమాపు అంటూ జాప్యం చేయసాగారు. దీంతో బాధితులు ఇటీవల జూబ్లీహిల్స్‌లోని సంస‌్థ కార్యాలయానికి వెళ్లి నిలదీశారు.

బాధితులు చెల్లించిన సొమ్ములో 20శాతం మాత్రమే సంస్థకు ముట్టిందని, మిగిలిన మొత్తం తమకు చేరలేదని, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు తాము నగదు చెల్లించిన రశీదులు సువర్ణభూమి నిర్వాహకులకు చూపించారు.

బాధితులు చూపిన రశీదుల్లో కొన్ని మాత్రమే అసలైనవని,మిగిలిన వాటితో సంస్థకు సంబంధం లేదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాదితులు ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థ ఎండీతో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.