Autobiographies | ప్రతి స్పోర్ట్స్‌ లవర్‌ చదవాల్సిన ఆటోబయోగ్రఫీలు ఇవే-these are the autobiographies of sports stars every sports lover should read ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  These Are The Autobiographies Of Sports Stars Every Sports Lover Should Read

Autobiographies | ప్రతి స్పోర్ట్స్‌ లవర్‌ చదవాల్సిన ఆటోబయోగ్రఫీలు ఇవే

Hari Prasad S HT Telugu
Dec 22, 2021 12:46 PM IST

Autobiographies.. తమ అభిమాన క్రీడాకారుడి జీవితం గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్‌కు ఈ ఆటోబయోగ్రఫీలు ఎంతగానో ఉపయోగపడతాయి. బుక్స్‌ అయినా, స్పోర్ట్స్‌ అయినా ఒక్కసారి అలవాటైతే ఇక వాటిని వదిలి ఉండలేం. మీకు ఈ రెండూ ఇష్టమైతే స్పోర్ట్స్‌ స్టార్ల ఆటోబయోగ్రఫీలను మీరు కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు.

తన ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వేను ఆవిష్కరిస్తున్న సచిన్ టెండూల్కర్
తన ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వేను ఆవిష్కరిస్తున్న సచిన్ టెండూల్కర్ (AFP)

స్పోర్ట్స్‌ అంటే ఇష్టపడే వాళ్లు.. స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకునే వాళ్లు ప్రముఖ స్పోర్ట్స్ స్టార్స్‌ రాసిన ఆటోబయోగ్రఫీలు కచ్చితంగా చదవాలి. క్రికెట్‌ అయినా, ఇతర ఏదైనా స్పోర్ట్‌ను కెరీర్‌గా తీసుకొని, వాటిలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్ల జీవితం ఎవరికైనా స్ఫూర్తిదాయకమే. వాళ్ల సంపాదన, వాళ్లకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ట్రెండింగ్ వార్తలు

అయితే ఇప్పటి వాళ్ల లగ్జరీ లైఫ్‌ వెనుక వాళ్లు పడిన కష్టనష్టాల గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ఆ విషయాలను కళ్లకు కట్టినట్లు వివరించేవే ఆటోబయోగ్రఫీలు. తమ అభిమాన క్రీడాకారుడి జీవితం గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్‌కు ఈ ఆటోబయోగ్రఫీలు ఎంతగానో ఉపయోగపడతాయి. బుక్స్‌ అయినా, స్పోర్ట్స్‌ అయినా ఒక్కసారి అలవాటైతే ఇక వాటిని వదిలి ఉండలేం. మీకు ఈ రెండూ ఇష్టమైతే స్పోర్ట్స్‌ స్టార్ల ఆటోబయోగ్రఫీలను మీరు కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. మరి ఏ స్పోర్ట్స్‌ స్టార్‌ ఏ ఆటో బయోగ్రఫీ రాశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సచిన్‌ టెండూల్కర్‌ ఆటోబయోగ్రఫీ - Playing It My way

క్రికెట్‌ లెజెండ్, ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడైన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అభినవ బ్రాడ్‌మన్‌గా, అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచిన ఈ లిటిల్‌ మాస్టర్‌ ప్లేయింగ్‌ ఇట్‌ మై వే పేరుతో తన ఆటోబయోగ్రఫీని రాశాడు. ఈ బుక్‌ అతని జీవితం మొత్తాన్ని మన కళ్ల ముందు ఆవిస్కరిస్తుంది. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం నుంచి ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌గా ఎదిగే వరకూ ప్రతి అడుగులూ, తనకు ప్రేరణగా నిలిచిన ప్రతి అంశాన్నీ సచిన్‌ ఇందులో వివరించాడు.

యువరాజ్‌సింగ్ ఆటోబయోగ్రఫీ - The Test of My Life

స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ తన ఆటో బయోగ్రఫీని ద టెస్ట్‌ ఆఫ్‌ మై లైఫ్‌ పేరుతో రాశాడు. 2011 ప్రపంచకప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన యువీ.. ఆ తర్వాత ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచాడు. ఆ తర్వాత కూడా క్రికెట్‌ ఫీల్డ్‌లో దిగి సత్తా చాటాడు. యువీ జీవితం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

డీగో మారడోనా ఆటోబయోగ్రఫీ - Touched by God

ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌లో ఒకడైన డీగో మారడోనా Touched by God: How We Won the Mexico '86 World Cup పేరుతో తన ఆటోబయోగ్రఫీని రాశాడు. అర్జెంటీనా 1986లో మారడోనా సారథ్యంలోనే విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఆ టోర్నీలో మారడోనా వివాదాస్పదంగా చేత్తో సాధించిన గోల్‌ హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌గా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. ఆ వరల్డ్‌కప్‌ విశేషాలతోపాటు తన జీవితాన్ని ఆవిష్కరించిందీ టచ్డ్‌ బై గాడ్‌ బుక్‌.

సునీల్‌ గవాస్కర్‌ ఆటోబయోగ్రఫీ - Sunny Days

ఇండియన్‌ క్రికెట్‌లో తొలి లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ తన ఆటో బయోగ్రఫీని సన్నీ డేస్‌ పేరుతో రాశాడు. అతన్ని సన్నీ అని ముద్దుగా పిలుస్తారన్న విషయం తెలుసు కదా. నిజానికి గవాస్కర్‌ పుట్టినప్పుడు అతన్ని హాస్పిటల్‌లో మరెవరో తీసుకెళ్లిపోతారు. ఈ విషయాన్ని గుర్తించిన అతని అంకుల్‌.. సన్నీని తిరిగి తన తల్లి దగ్గరికి చేరుస్తాడు. ఈ విషయంతో సహా.. తన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలను ఈ సన్నీ డేస్‌ బుక్‌లో గవాస్కర్‌ వివరించాడు.

సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ - Ace Against Odds

ఇండియన్‌ టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి, లక్షలాది మందిని ఈ క్రీడవైపు ఆకర్షించేలా చేసిన ఘనత మన హైదరాబాదీ సానియా మీర్జాకు దక్కుతుంది. తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను వివరిస్తూ ఆమె ఏస్‌ అగైన్ట్స్‌ ఆడ్స్‌ పేరుతో తన ఆటోబయోగ్రఫీని రాసింది.

సైనా నెహ్వాల్‌ ఆటోబయోగ్రఫీ - Playing To Win

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో ఇండియాకు తొలి మెడల్‌ సాధించిపెట్టిన మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్‌పై వచ్చిన సైనా సినిమా చూసే ఉంటారు. ఆ మూవీ చూసి ఉండకపోతే ఆమె రాసిన తన ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్‌ టు విన్‌ చదవండి. ఆమె జీవితం మొత్తం మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది.

ఈ ఆటో బయోగ్రఫీలు కూడా చదవండి

- మహ్మద్‌ అలీ ఆటోబయోగ్రఫీ - The Greatest: My Own Story

- పీలే ఆటోబయోగ్రఫీ - Why Soccer Matters

- కపిల్‌ దేవ్‌ ఆటోబయోగ్రఫీ - Straight from the Heart

- మేరీకోమ్‌ ఆటోబయోగ్రఫీ - Unbreakable

- మిల్కాసింగ్‌ ఆటోబయోగ్రఫీ - The Race of My Life

- పీటీ ఉష ఆటోబయోగ్రఫీ - Golden Girl

 

WhatsApp channel

సంబంధిత కథనం