MS Dhoni | కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ధోనీ గతేడాదే చెప్పాడు: ఫ్లెమింగ్-stefen fleming says dhoni told him to quits captaincy last year ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni | కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ధోనీ గతేడాదే చెప్పాడు: ఫ్లెమింగ్

MS Dhoni | కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ధోనీ గతేడాదే చెప్పాడు: ఫ్లెమింగ్

HT Telugu Desk HT Telugu
Mar 27, 2022 12:44 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. గత సీజన్‌లోనే కెప్టెన్ గా తప్పుకుంటానని ధోనీ తనతో చెప్పాడని స్పష్టం చేశారు. శనివారం చెన్నైపై కోల్‌కతా ఘన విజయం సాధించింది.

<p>ధోనీ</p>
ధోనీ (PTI)

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ ఇటీవల తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో జట్టు యాజమాన్యం అతడి స్థానంలో రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పజెప్పింది. అయితే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అనే వార్తలు వినిపిస్తోన్న తరుణంలో కెప్టెన్‌గానే ఘనంగా ముగించాలని అభిమానులు కోరుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. మహీ గత సీజన్‌లో టైటిల్ నెగ్గగానే కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాడని, కెప్టెన్సీని జడేజాకు ఇవ్వాలని అప్పుడే తనకు చెప్పాడనే ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు.

yearly horoscope entry point

"కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై గత సీజన్‌లోనే మేము మాట్లాడుకున్నాం. చెన్నై గెలిచాక ధోనీ ఈ విషయాన్ని నాతో చెప్పాడు. దీంతో జడేజాకు నాయకత్వం అప్పగించాలనే విషయంపై అన్ని విధాల చర్చించి నిర్ణయం తీసుకున్నాం. తాజాగా ధోనీ ప్రకటనతో కెప్టెన్సీ మార్పు సజావుగా సాగింది" అని ఫ్లెమింగ్ అన్నారు. కోల్‌కతాతో శనివారం జరిగిన మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు.

ఇక చెన్నై ఓటమీపై స్పందించిన ఫ్లెమింగ్.. ముంబయిలో పరిస్థితులను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమని, అయితే ఈ మ్యాచ్‌లో తాము కొద్ది బంతుల తేడాతోనే పరాజయం చెందామని తెలిపారు. ఈ ఓటమిని అధిగమించి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

ఐపీఎల్ 15వ సీజన్‌ను కోల్‌కతా ఘనంగా ఆరంభించింది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో చెన్నైను 6 వికెట్ల తేడాతో ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు . 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి ఒక దశలో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన చెన్నైని కెప్టెన్‌ జడేజా, మాజీ కెప్టెన్‌ ధోనీ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధోనీ కేవలం 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్